శెభాష్ బేటీ : స్టోరీ టెల్లింగ్ లో హైదరాబాద్ చిన్నారికి వరల్డ్ కప్

ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారులు అద్భుతాలు సాధిస్తున్నారు. అత్తాపూర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదివే అనన్య స్టోరీ టెల్లింగ్ వరల్డ్ కప్  విజేతగా నిలిచింది.

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 06:16 AM IST
శెభాష్ బేటీ : స్టోరీ టెల్లింగ్ లో హైదరాబాద్ చిన్నారికి వరల్డ్ కప్

ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారులు అద్భుతాలు సాధిస్తున్నారు. అత్తాపూర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదివే అనన్య స్టోరీ టెల్లింగ్ వరల్డ్ కప్  విజేతగా నిలిచింది.

ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారులు అద్భుతాలు సాధిస్తున్నారు. అమ్మ ఒడిలో కథలు వినాల్సిన వయస్సులోనే.. స్టోరీ టెల్లింగ్ లో అంతర్జాతీయ ఖ్యాతి సాధిస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలు వినే వయస్సులోనే.. అరుదైన రికార్డ్ సాధించింది హైదరాబాద్ చిన్నారి. స్టోరీ టెల్లింగ్‌లు అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన చిన్నారి అనన్యా బోయని. అత్తాపూర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదివే అనన్య స్టోరీ టెల్లింగ్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

2019, ఏప్రిల్ 12న మలేసియాలోని బీకన్‌హౌజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన వరల్డ్ స్టోరీటెల్లింగ్ ఫైనల్‌ పోటీల్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అన్యన్య స్టోరీ టెల్లింగ్ లో విజేతగా నిలిచింది. ఇదే స్కూల్ కు చెందిన ఎవాంజలీన్‌ గ్రేస్ అనే మరో చిన్నారి వరల్డ్ స్టోరీ టెల్లింగ్ ఫైనల్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.

ఎవాంజలీన్ 2018 మే నెలలో కౌలాలాంపూర్‌లో రైమ్స్ వరల్డ్‌కప్ టైటిల్‌ కూడా సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 మంది పిల్లలు పోటీ పడ్డారు. వీరిలో స్టోరీ టెల్లింగ్ లో వరల్డ్ కప్ తో పాటు ప్రశంసా పత్రం, రూ.30వేల నగదు బహుమతి కూడా అనన్య గెలుచుకుంది.