Hyderabad : హనుమంతుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య

‘నన్ను హనుమంతుడు పిలుస్తున్నాడు..వెళ్లిపోతున్నాను’అని లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం సృష్టించింది.

Hyderabad : హనుమంతుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య

Man Who Is Not Married Commits Suicide

man who is not married commits suicide : శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యం చాలా ప్రమాదం. ఒత్తిడి మనిషిని కృంగదీయటమే కాదు..ప్రాణం తీసుకునేందుకు కూడా ప్రోత్సహిస్తుంది. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక..దాన్నుంచి బయటపడలేక. అలా ఒత్తిడికి గురై హైదరబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 40 ఏళ్ల వయసున్న ఆయన పెళ్లి కావడం లేదన్న మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.సిద్దిపేట జిల్లా కొండపాక ఎర్రవెల్లి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల గోపాల్‌ కవాడిగూడలోని తాళ్లబస్తీలో తమ్ముడు రవితో కలిసి నివాసిస్తున్నాడు. ఇద్దరు కలిసి పనిచేసుకుంటు జీవిస్తున్నారు. తమ్ముడికి 37 ఏళ్లు. ఈక్రమంలో రవికి వివాహం అయ్యింది. దీంతో వేరే ఉంటున్నాడు. రవి భార్యతో కలిసి రామంతపూర్ లో ఇల్లు తీసుకుని వేరే ఉంటున్నాడు. అలా ఆరు నెలలు అయ్యింది.

ఈక్రమంలో ఆదివారం పనికి సెలవు ఉందని రవి అన్న గోపాల్ ను చూడటానికి కవాడిగూడకు వచ్చాడు. రవి వచ్చేసరికి గోపాల్ యోగా చేసుకుంటున్నాడు. దీంతో మధ్యలో డిస్ట్రబ్ చేయటం ఎందుకని యోగా పూర్తి అయ్యేంత వరకు అన్నను చూస్తు కూర్చుని పూర్తి అయ్యాక కాసేపు మాట్లాడుకుని తిరిగి రామంతపూర్‌ వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి గోపాల్ బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రవి వచ్చి వెళ్లినప్పటినుంచి గోపాల్ రూమ్ తలుపులు మూసే ఉండటంతో చుట్టుపక్కలవారు ఇంటికెళ్లి డోర్ కొట్టి పిలిచారు. అయినా సమాధానం రాలేదు. పడుకున్నాడనుకుని ఊరుకున్నారు. కానీ సాయంత్రం అయినా గోపాల్ బయటకు రాకపోయేసరికి వారికి అనుమానం వచ్చింది. మరోసారి డోర్ కొట్టి పిలిచారు. అయినా సమాధానం రాలేదు. దీంతో అనుమానం పెరిగి బుధవారం (జులై 28,2021) పోలీసులకు ఫోన్ చేసారు.

వెంటనే వచ్చిన పోలీసులు గోపాల్ గది తలుపును బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది గోపాల్ మృతదేహం. అలా ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డ గోపాల్ బుధవారం నాడు ఆ విషయం బయటపడింది. మూడు రోజుల క్రితమే అతడు చనిపోయాడని పోలీసులు భావించారు. క్లూస్ టీమ్ చేరుకొని వివరాలను సేకరించారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.ఆ ఆత్మహత్య లేఖలో ‘నన్ను ఆంజనేయ స్వామి పిలుస్తున్నాడు..అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాను’ అని రాసి ఉంది.

గోపాల్ మృతిపై అతడి సోదరుడు రవికి సమాచారం ఇవ్వగా వెంటనే అన్న ఇంటికి వచ్చిన రవి అన్నకోసం విలపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడికి పెళ్లయినప్పటి నుంచి గోపాల్ దిగులుగా ఉంటున్నాడని..ఎవ్వరితోను సరిగా మాట్లాడటంలేదని..పెళ్లి కావడం లేదని బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే తనకు వివాహం కావట్లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.