డబ్బే డబ్బు : ఒకే రోజు రూ.2.60 కోట్లు సీజ్

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 10:06 AM IST
డబ్బే డబ్బు : ఒకే రోజు రూ.2.60 కోట్లు సీజ్

హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పట్టుబడుతున్న డబ్బు ఔరా అనిపిస్తోంది. మొన్నటికి మొన్న మురళీమోహన్ కంపెనీకి చెందిన 2 కోట్ల రూపాయలు దొరికితే.. మళ్లీ ఇప్పుడు ఒకే రోజు 2 కోట్ల 60 లక్షలు పట్టుబడ్డాయి. బంజారాహిల్స్, మలక్ పేట ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సరైన పత్రాలు చూపించని కారణంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ అడిషినల్ డీసీపీ రాధాకృష్ణ, చైతన్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. సాత్విక్ రెడ్డి, సౌరబ్ గోయల్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.26.19 లక్షలు డబ్బు తరలిస్తుండగా సోమాజీగూడలో ఏప్రిల్ 6వ తేదీ శనివారం పట్టుకున్నాం అని వెల్లడించారు. అలాగే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 5268 నంబర్ గల కారులో తాండ్ర కాశీనాథ్ రెడ్డి, తిరుమలగిరికి చెందిన భుక్యా రవిలు రూ.34.30 లక్షలు తరలిస్తుండగా ముసారాంబాగ్ లో స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో టాటా ఇన్నోవాలో మల్లారెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీలో ఒకే రోజు 2 కోట్ల 60 లక్షలు పట్టబడ్డాయి.