క్రికెట్‌లో సంస్కరణలు : కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్

  • Published By: madhu ,Published On : September 28, 2019 / 05:55 AM IST
క్రికెట్‌లో సంస్కరణలు : కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కలిశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచినందుకు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం బుద్ధభవన్ కలిసిన అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. 

క్రికెట్‌లో సంస్కరణలు తీసుకొస్తామని, గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సాహిస్తామని ప్రకటించారు. క్రికెట్‌కు ప్రభుత్వం సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను కోరడం జరిగిందన్నారు. క్రికెట్ అభివృద్ధికి సహకరిస్తామని కేటీఆర్ చెప్పారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీఠ వేస్తోందని కొనియాడారు. 

సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం హెచ్‌సీఏ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 147 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. పోటీగా నిలిచిన ప్రకాశ్ జైన్‌‌కు 73ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. వీటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. అజారుద్దీన్ రెండో ఇన్నింగ్స్‌గా హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఎన్నికల అధికారి వీఎస్ ప్రశాంత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. 4 గంటలకు ఫలితాలను వెల్లడించారు. 
Read More : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్