Hyderabad Rains : హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం

 హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం ప‌డింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్​, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, షేక్‌పేట‌, హైదర్​ నగర్​, కేపీహెచ్​బీ కాలనీ, పంజాగుట్ట, మియాపూర్, హెహిదీపట్నం, కోఠి, నాంప‌ల్లి, ల‌క్డీకాపూల్‌లో భారీ వర్షం కుర‌వ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లు చోట్ల రోడ్ల‌పై నీరు నిలిచింది. మ‌రోవైపు, జనగామ జిల్లాలోనూ భారీ వర్షం ప‌డుతోంది.

Hyderabad Rains : హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం

Rain

Hyderabad Rains : హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం ప‌డింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్​, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, షేక్‌పేట‌, హైదర్​ నగర్​, కేపీహెచ్​బీ కాలనీ, పంజాగుట్ట, మియాపూర్, హెహిదీపట్నం, కోఠి, నాంప‌ల్లి, ల‌క్డీకాపూల్‌లో భారీ వర్షం కుర‌వ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లు చోట్ల రోడ్ల‌పై నీరు నిలిచింది. మ‌రోవైపు, జనగామ జిల్లాలోనూ భారీ వర్షం ప‌డుతోంది. అలాగే, చీటకోడూరు రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వ‌దిలారు.

కుందారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాగ‌ల మూడు రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇవాళ‌, రేపు ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. తెలంగాణ‌లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అలాగే, రేపు, ఎల్లుండి 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయ‌ని చెప్పింది. ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది.

China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్