దసరా రోజున భారీవర్ష సూచన

దసరా పండుగ రోజు, ఆ తర్వాతి రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 03:27 PM IST
దసరా రోజున భారీవర్ష సూచన

దసరా పండుగ రోజు, ఆ తర్వాతి రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

దసరా పండుగ రోజు, ఆ తర్వాతి రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్పారు. ఇది ఉపరితల ఆవర్తనంగా మారి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందన్నారు. 

ఆదివారం (అక్టోబర్ 6, 2019) హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, నాంపల్లి, అబిడ్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. వర్షంతో వాహనచోదలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీడిమెట్లలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. మరోవైపు నారాయణ ఆసుపత్రిలోకి వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.