బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 05:49 AM IST
బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర

హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ ని అమల్లోకి తెచ్చారు. ఆ రూల్ ప్రకారం.. ఇకపై బైక్ నడిపే వారే కాదు.. వెనుక కూర్చున్న వారు కూడా హైల్మెట్ పెట్టుకోవాల్సిందే. లేదంటే రూ.100 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

బైక్ పై ఇద్దరు వెళ్లేటప్పుడు బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. ఒక వేళ వెనుకున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోతే ట్రాఫిక్ పోలీసులు రూ.100 ఫైన్ వేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. అప్పుడే జరిమానాలు కూడా విధిస్తున్నారు. ట్రాఫిక్స్ రూల్స్ ను పాటించాలనే ఉద్దేశంతో, ప్రమాదాల నివారణం కోసం ఫైన్లు వేస్తున్నామని పోలీసులు వివరించారు.

ఈ రూల్ పై వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే హెల్మెట్ నిబంధనని అమలు చేస్తున్నారని, ఫైన్లు వేస్తున్నారని వాపోయారు.

70శాతం అనర్థాలు హెల్మెట్ లేకపోవడం వల్లే:
ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ ఉంది. ఇక మీదట వెనుక కూర్చున్న వారు కూడా హెల్మట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగానే ప్రాణాలు పోతున్నాయి. బైక్ ప్రమాదాల్లో 70 శాతం అనర్థాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఒక్కోసారి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడుతుంటే… వెనక కూర్చొని హెల్మెట్ పెట్టుకోని వ్యక్తి చనిపోతున్నాడు. అందుకే.. బైక్ పై ఇద్దరు వెళ్తే… ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని ట్రాఫిక్ పోలీసులు తేల్చి చెప్పారు.

బైక్ నడిపే వ్యక్తిదే బాధ్యత:
హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్లు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ రూల్ అమలవుతోంది. ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోనూ నిబంధన అమల్లోకి వచ్చింది. హెల్మెట్లు పెట్టుకోకపోతే… కేసులు రాసి ఫైన్లు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చలానాలు ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ ఫైన్ చెల్లించాల్సింది బైక్ నడిపే వ్యక్తే. అంటే.. వెనక కూర్చున్న వ్యక్తి బాధ్యత కూడా బైక్ నడిపే వ్యక్తిదే అన్నమాట. రాచకొండ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 263 కేసులు రాశారు. రూ.28,400 జరిమానాలు వేశారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల ప్రజలంతా… రెండు హెల్మెట్లు కొనుక్కోవడం బెటర్. లేదంటే జేబుకి చిల్లు పడటం ఖాయం.

ఈ రూల్ పై వాహనదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మంచి రూల్ అని, ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని అంటున్నారు. అయితే.. ఇదెక్కడి గోల అని కొందరు వాహనదారులు విసుక్కుంటున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదని జరిమానా విధించడం కరెక్ట్ కాదంటున్నారు.
 
మరణాల సంఖ్య తగ్గించడమే టార్గెట్:
జరిమానాలు విధించడమే ఉద్దేశ్యంగా ఈ రూల్ తీసుకురాలేదని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే తమ లక్ష్యం అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని నామ మాత్రపు జరిమానా(రూ.100) విధిస్తున్నామన్నారు. వాహనదారులు స్వీయ నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం అన్నారు. ప్రాణాలు విలువైనవని గ్రహించాలన్నారు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని పోలీసులు గుర్తు చేశారు.