విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నాని ట్వీట్ : చదువంటే మార్కులే కాదు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 08:11 AM IST
విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నాని ట్వీట్ : చదువంటే మార్కులే కాదు

జెర్సీ సినిమాతో మంచి విజ‌యం సాధించిన నాని త‌న ట్విట్టర్‌లో విద్యార్ధుల‌ని ఉద్దేశించి ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. చ‌దువు అంటే మార్కుల ప‌త్రాల‌పై నెంబ‌ర్లు కాదు. నేర్చుకోవ‌టం మాత్ర‌మేనన్నారు. నువ్వు అర్హ‌త సాధించని ప్ర‌తీ సారి తిరిగి పోరాటం చేయాలే తప్ప వెనుకడుగు వేయవద్దన్నారు. పోరాటం మాత్రం మానవద్దని ప్రోత్సహించారు. పరీక్షల కంటే వీటన్నింటికంటే జీవితం చాలా ముఖ్య‌మైన‌ది. మీ త‌ల్లితండ్రుల గురించి, మిమ్మ‌ల్ని ప్రేమించే వారి గురించి ఒక్క‌సారి ఆలోచించండి. వారు ప్రేమించేది మీ ఇంట‌ర్మీడియెట్ రిజ‌ల్ట్స్‌ని కాదు.. కేవ‌లం మిమ్మ‌ల్ని చూసి అంటూ నాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read : సీఎం చంద్రబాబే.. పవర్ మాత్రం లేదు : సీఎస్ వ్యాఖ్యల కలకలం

కాగా ఇంటర్ బోర్డ్ ఘోర తప్పిదాలతో 20మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో పలు నిరసనలు..ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొనటంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని , ఇప్పటికే రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు ఇంట‌ర్మీడియెట్ బోర్డు పేర్కొంది.
 

Also Read : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం : ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్