హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

  • Published By: vamsi ,Published On : November 29, 2019 / 09:05 AM IST
హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

సినీ హీరో రాజశేఖర్‌కు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలనీ పోలీసులు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఆర్టీఏకి లేఖను రాశారు. ఇటీవల రాజశేఖర్ కారు ప్రమాదానికి గురవగా.. అంతకుముందు కూడా రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. అయితే రెండు ప్రమాదాల్లో కూడా రాజశేఖర్ కు అదృష్ట వశాత్తు ఏమీ జరగలేదు. 2017 అక్టోబ‌ర్ 9న  రాజశేఖర్ కారు తొలిసారి ప్ర‌మాదానికి గురైనప్పుడు ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేశాడంటూ అతనిపై కేసు నమోదు అయ్యింది.

రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..  పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షల్లో రాజశేఖర్ మద్యం తీసుకోలేదని తేలింది. అయితే రీసెంట్‌గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో కారు నడపడంతో హీరో రాజశేఖర్ కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అయితే ఓఆర్ఆర్ పై రాష్ డ్రైవింగ్ చేసిన కారణంగా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ పోలీసులు ఆర్టీఏ వాళ్లకు లేఖ రాశారు. దీంతో మరికొన్ని రోజుల్లో రాజశేఖర్ కారు లైసెన్స్ రద్దు కానుంది. ఇప్పటికే హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధలను పలు మార్లు ఉల్లఘించడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.