ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 11:57 AM IST
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో పిటిషన్ ను కొట్టివేసింది. 5 వేల 100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై తీసుకున్న తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు ఆమోదం లభించినట్లైంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. రూట్ల ప్రైవేటీకరణపై బలమైన వాదన వినిపించామని తెలిపారు.

ప్రైవేట్ రూట్ల కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆర్టీసీ భవితవ్యం కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేవనెత్తిన అంశం కావొచ్చు లేదా ప్రభుత్వ తరపు న్యాయవాది లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ను చదువుతోంది. పిటిషన్ ను ఎందుకు రిజక్ట్ చేసిందన్న దానిపై కొన్ని కారణాలు చూపుతూ కోర్టు ఆర్డర్ పాస్ చేస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. 

ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికే హైకోర్టు లేబర్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో కార్మికులు విధుల్లో జాయిన్ కావడానికి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కార్మికుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించి, ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కార్మికులు సమ్మె విరమించి స్వచ్ఛంద విధుల్లోకి వస్తామని కార్మికులు ప్రకటన, హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసిన క్రమంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్న ఫైనల్ నిర్ణయాన్ని కొద్ది సేపట్లో చెప్పే అవకాశం ఉంది.