ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

  • Edited By: veegamteam , November 7, 2019 / 11:57 AM IST
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ ప్రధాన ధర్మాసనంలో ఉన్నందున జీతాల పిటిషన్ ను వచ్చే గురువారం (నవంబర్ 14, 2019) వాయిదా వేసింది కోర్టు. 

(అక్టోబర్ 5, 2019) వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరింది. సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కార్మికులు సమ్మెకు దిగడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రభుత్వం సమ్మెలో ఉన్న కార్మికులందరికి సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకుండా నిలిపి వేసింది. ఇప్పటివరకు కూడా వారికి జీతాలు చెల్లించకపోవడం గమనార్హం.

కార్మికులు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం విధించిన గడువు లోపు కార్మికులు విధుల్లో చేరకపోతే వారిని ఆర్టీసీ కార్మికులుగా గుర్తించలేమని, సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని బెదిరించింది. అయినా కార్మికులు ప్రభుత్వ హెచ్చరికలకు బెదరకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. 

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను (నవంబర్ 11, 2019) తేదీకి వాయిదా వేసింది. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. విచారణకు సీఎస్‌ జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరవ్వగా… అధికారులిచ్చిన నివేదికలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులే ఇలాంటి నివేదికలు ఇస్తే ఎలా అని ప్రశ్నించింది. చాలా తెలివిగా గజిబిజి లెక్కలు చూపారని… ఇంతవరకు ఏ బడ్జెట్‌లోనూ ఇలాంటి లెక్కలు చూడలేదని సీరియస్ అయింది. ఈ నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ను అదేశించింది.