చట్ట విరుద్ధమని ఎలా అంటారు : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని ప్రశ్నించింది.

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 12:05 PM IST
చట్ట విరుద్ధమని ఎలా అంటారు : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని ప్రశ్నించింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ, ప్రైవేట్ వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయం తప్పు ఎలా అవుతుందని పిటిషనర్ ను ప్రశ్నించింది. 5100 రూట్లను ప్రైవేటీకరించడం చట్ట విరుద్ధమని పిటిషనర్ చెప్పగా..ఎలా చట్ట విరుద్ధమో తెలపాలని కోర్టు చెప్పింది. సెక్షన్ 99, 100, 102, 104 లను పిటిషనర్ ప్రస్తావించగా.. పిటిషనర్ లో లేవనెత్తిన అంశాలకు ఇప్పుడు చెబుతున్న సెక్షన్లకు పొంతనలేదని కోర్టు తెలిపింది.

హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలన్నారు. ఆర్టీసీకి నష్టం జరగదని సీఎం చెప్పినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలుపుగా.. సీఎం ఏం చెప్పారన్నది న్యాయస్థానానికి అవసరం లేదని కోర్టు తెలిపింది. కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా అన్నదే ముఖ్యమని తెలిపింది. 

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని హైకోర్టు తెలిపింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతోందా అంటూ పిటిషనర్ ను ప్రశ్నించింది హైకోర్టు. తదుపరి విచారణ బుధవారం (నవంబర్ 20, 2019)వ తేదీకి వాయిదా వేసింది.