హైకోర్టు ప్రశ్న : పంచాయితీలను చంపేస్తారా

పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను విస్తరించే అధికారం ప్రభుత్వానికి ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పట్టణీకరణ చేస్తూ పంచాయతీలను చంపేస్తారా? అనీ..పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించరా?

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 09:21 AM IST
హైకోర్టు ప్రశ్న : పంచాయితీలను చంపేస్తారా

పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను విస్తరించే అధికారం ప్రభుత్వానికి ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పట్టణీకరణ చేస్తూ పంచాయతీలను చంపేస్తారా? అనీ..పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించరా?

 హైదరాబాద్ : పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను విస్తరించే అధికారం ప్రభుత్వానికి ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పట్టణీకరణ చేస్తూ పంచాయతీలను చంపేస్తారా? అనీ..పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించరా? అంటు ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. దీనికి ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు సమాధానమిస్తూ పట్టణాలను, పంచాయితీలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే ప్రభుత్వం పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో పట్టణాల్లో గ్రామాల విలీనం చెల్లదని హైకోర్టు ఉత్తర్వులిస్తే..దీనికి సంబంధించి మరో నోటిఫికేషన్‌ జారీ చేసి 21 రోజుల్లో ఆయా పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించడానికి సర్కారు సిద్ధంగా ఉందని చెప్పారు.