ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా : డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్

డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 10:36 AM IST
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా : డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్

డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో

డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో డెంగ్యూ నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించలేదని ఆగ్రహించింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో ధర్మాసనం ముందుకు వచ్చి వివరించాలని పలువురు ఉన్నతాధికారులను కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్లు గురువారం(అక్టోబర్ 24,2019) తమ ముందు హాజరుకావాలంది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ విజృంభించింది. కొన్ని రోజులుగా డెంగ్యూ బారిన పడి చిన్నారులు, పెద్దలు, వృద్ధులు చనిపోతున్నారు. డెంగీ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం(అక్టోబర్ 23,2019) విచారించింది. 

తెలంగాణలోనే కాదు ఏపీలోనూ డెంగ్యూ డేంజరస్ గా మారింది. డెంగ్యూ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధితో అనేకమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులు క్రితం డెంగ్యూ కారణంగా బాల నటుడు గోకుల్ సాయి మరణించటం అందరినీ కలిచి వేసింది. ఈ విషాదం మర్చిపోక ముందే మహిళా న్యాయమూర్తి జయమ్మ హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.