హైటెన్షన్ : పోలీసులపై రాళ్ల దాడి.. టియర్ గ్యాస్ ప్రయోగం

ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 09:52 AM IST
హైటెన్షన్ : పోలీసులపై రాళ్ల దాడి.. టియర్ గ్యాస్ ప్రయోగం

ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు

ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే భారీ సంఖ్యలో కార్మికులు తరలిరావడంతో అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. 

మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. లిబర్టీ దగ్గర ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొత్తంగా ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. శనివారం(నవంబర్ 9,2019) మధ్యాహ్నం నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు భారీగా చేరుకున్నారు. బారికేడ్లు, ఇనుప కంచెలు దూకి ట్యాంక్ బండ్ వైపు దూసుకెళ్లారు. పలువురు నాయకులను, కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. 

మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్మికులు నిరసన తెలుపుతూ అన్నివైపుల నుంచి ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పోలీసులు దొరికినవారిని దొరికినట్లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శనివారం చలో ట్యాంక్‌బండ్‌ తలపెట్టిన సంగతి తెలిసిందే. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసినా… ఆందోళనకారులు ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు.