ICFAIలో మంజీరా కట్ : 3వేల మంది స్టూడెంట్స్ ఇబ్బందులు

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 07:59 AM IST
ICFAIలో మంజీరా కట్ : 3వేల మంది స్టూడెంట్స్ ఇబ్బందులు

ప్రముఖ విద్యా సంస్థగా పేరొందిన ఐసీఎఫ్ఏఐ (ICFAI)లో విద్యార్థులు నీటి కోసం తహతహలాడుతున్నారు. నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటున్నారు స్టూడెంట్స్. నీళ్లు లేకపోవడంతో సుమారు 3వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు మంజీరా నీటి సరఫరాను ఆపేయడంతో క్యాంపస్‌లో దుర్బర పరిస్థితి నెలకొంది.  గత మూడు వారాలుగా నీటిని సప్లై చేయడం లేదు. 
Read Also : అంబానీ ఫ్యామిలీనా మ‌జాకా : కోడ‌లికి ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చిన అత్త‌

మెదక్ జిల్లాలోని దొంతపల్లిలో ఐసీఎఫ్ఏఐ (ICFAI) ఉంది. శంకర్ పల్లిలో ఉన్న క్యాంపస్‌కు 200 కిలో లీటర్ల మంజీరా నీటిని సరఫరా చేస్తుంటారు. మంజీరా రిజర్వాయర్‌లో లెవల్స్ పడిపోవడంతో నీటి సరఫరాను ఆపివేసినట్లు HMWS&SB అధికారి వెల్లడించారు. దీనితో క్యాంపస్‌లో దుర్బరపరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, కేవలం మంజీరా నీటిపైనే ఆధారపడాల్సి ఉందని Icfai అధికారి తెలిపారు. 9 బోర్‌వెల్స్ వేయించామని..అందులో ఆరు బోర్లలో నీరు ఇంకిపోయిందన్నారు. కొన్ని సంవత్సరాల అనంతరం ఇలా జరిగిందన్నారు. 

ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తోందని, నీటి సమస్యల వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వెల్లడించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు, కేసీఆర్ స్పందన కోసం తాము ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. Icfai ట్యాంకర్లను సమకూర్చుకుంటే తాము నీటిసరఫరా చేయగలుగుతామని వాటర్ బోర్డు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్‌‌తో Icfai యాజమాన్యం భేటీ అయ్యింది. నీటి సమస్యను పరిష్కరించాలని కోరింది. వీరి సమస్యను అధికారులు తీరుస్తారా ? లేదా ? అనేది చూడాలి. 
Read Also : ప్లీజ్ చెక్ : ఈ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి‌