స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

వేసవికాలంలో స్విమ్మింగ్ పూల్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. మరి అంతేస్థాయిలో నిర్వహణ కూడా ఉండాలి కదా. కానీ, హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ ఐదేళ్ల చిన్నారి బలైపోయింది. 

స్విమ్మింగ్ పూల్‌కు ఈత నేర్చుకుందామని వచ్చిన చిన్నారి అదుపుతప్పింది. కానీ, కోచ్, పక్క సిబ్బంది గమనించలేదు. చాలాసేపటి తర్వాత తేరుకుని బాలికను పైకి తీసుకొచ్చారు. అప్పటికే ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందించడం మొదలుపెట్టినా.. కాపాడుకోలేకపోవడంతో మార్చి 27 బుధవారం మృతి చెందింది. 

ఆల్వాల్ ప్రాంతంలోని ఆ స్విమ్మింగ్ పూల్ మేనేజ్‍‌మెంట్, కోచ్‌లపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.