హైదరాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే..

హైదరాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే..

Hyderabad:రెండు దశాబ్దాల తర్వాత Hyderabad లో భారీ వర్షం కురిసింది. తూర్పు, మధ్య తెలంగాణలో రెడ్ అలర్ట్, ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.



*

హయ్యత్ నగర్ 27 సెంటిమీటర్లు

*

ఉస్మానియా యూనివర్సిటీ 26 సెంటిమీటర్లు

*

సరూర్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 24సెంటిమీటర్లు

*

రామాంత్‌పూర్, మోండా మార్కెట్, మల్కాజ్ గిరి 23 సెంటిమీటర్లు

*

హస్తినాపూర్ 28 సెంటిమీటర్లు

*

హబ్సిగూడ్, రెయిన్ బజార్, ఛార్మినార్, మచ్చాబొల్లారం 22 సెంటిమీటర్లు

*

మెట్టుగూడ, కుషాయిగూడ్, చర్లపల్లి 21సెంటిమీటర్లు

*

చాంద్రాయణగుట్టలో ఇళ్లు కూలి తొమ్మిది మంది మృతి చెందారు. ఇందులో రెండు నెలల పసికందు కూడా ఉంది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, సిద్ధిపేట, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం కూడా వర్షం కురుస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.