రాస్కో తర్వాత చూద్దాం : క్యాబ్ చలానాలు రూ.18వేలు

రాస్కో తర్వాత చూద్దాం :  క్యాబ్ చలానాలు రూ.18వేలు

ట్రాఫిక్ రూల్స్ పాటించండి బాబూ.. అంటూ ఎంత మొత్తుకున్నా ఎవరి ఇష్టం వారిది అన్నట్లు తయారైంది పరిస్థితి. ఫైన్‌లు వేస్తూ వస్తున్న పరిస్థితి మారడం లేదు. ఉండేటి సింహేంద్ర రావు అనే వ్యక్తి ఒకటి.. రెండూ కాదు 104 చలానాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. తప్పు చేసిన ప్రతిసారి ఫైన్ వేసుకుంటూ పోతున్న పోలీసు వారు ఈసారి చెకింగ్ చేయడంతో  సింహేంద్ర రావు చిట్టా బయటికొచ్చింది.

గచ్చీబౌలిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద నో పార్కింగ్ జోన్‌లో మంగళవారం కార్ పార్క్ చేసి ఉండటం చూసి ట్రాఫిక్ ఎస్సై కే రాములు చెకింగ్ చేశాడు. దాంతో వెహికల్ నెంబర్ చేయగా మొత్తం104చలానాలు పెండింగ్‌లో ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. ప్రెష్‌గా ఉన్నదాంతో కలిపి మొత్తంగా రూ.17వేల 805రూపాయలకు చేరింది. 

ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్‌పై చార్జి షీట్ నమోదు చేసి, వెహికల్‌ను సీజ్ చేశారు. రావును కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వాహనం యజమాని పేరిట ఉన్న 10పెండింగ్ చలానాలకు చార్జిషీట్ నమోదైనట్లు పేర్కొన్నారు. 

జూలై 2016లో ఇలాగే టూ నో పార్కింగ్‌లో పెట్టి ఉంచిన వెహికల్‌ను పరిశీలిస్తే 105 పెండింగ్ చలానాలు వాటిలో రూ16వేల 390ల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.