లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

ఎలక్ట్రీషియన్ గెటప్‌లో రెక్కీ.. ఆఫీసు టైముల్లోనే చోరీలు.. వీకెండ్స్ లో జల్సాలు

Updated On - 5:58 pm, Wed, 9 December 20

Hyderabad: cyberabad police arrested Thief rs 52 lakh worth gold seized : చోరీ చేయటానికి ఉండాలి ఓ పద్దతి..ఓ విధానం..ఓ ప్లాన్, ఓ టైమింగ్ అంటాడు ఈ వెరైటీ దొంగ. 10th క్లాస్ వరకూ చదివిన 28 ఏళ్ల యువకుడు చోరీకి ప్లాన్ వేశాడు అంటే దండిగా డబ్బు, బంగారం వచ్చి పడాల్సిందే. చాలా నీట్ గా ఎటువంటి కంగారు లేకుండా పక్కా ప్లానింగ్ తోను పక్కా టైమింగ్ తో పని కానిచ్చేస్తాడీ స్మార్ట్ దొంగ.అది కూడా ఎంత నీట్ గా అంటే..ఆఫీస్‌కి వెళ్లొచ్చినట్లు ఎంచక్కా చోరీలకు వెళ్తాడు. సాయంత్రం కాగానే ఆఫీస్‌ నుంచి ఇంటి కొచ్చినట్లు వచ్చేస్తాడు. ఒంటిమీద బట్టలు కూడా నలగవు. అంత నీట్ గా దోచేస్తాడు. అలా దోచేసిన సొమ్ముతో వీకెండ్ పార్టీలో జల్సాలు చేస్తాడు. కానీ ఎంత తెలివి ఉన్నా ఎక్కడోక చోట..ఎప్పుడోకప్పుడు చిక్కక తప్పదుగా..అలాగే ఈ స్మార్ట్ దొంగను సైబరాబాద్ పోలీసుల పక్కా ప్లాన్ తో పట్టేశారు. ఆ దొంగ పేరు మీర్ కాజాం అలీ ఖాన్ అలియాస్ సూర్య అన్న.సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ లోని టోలీచౌకీ ఏరియాలోని పారామౌంట్ కాలనీకి చెందిన కాజాం అలీ ఖాన్ అలియాస్ సూర్య అన్న 10th చదివాడు. ఆ తరువాత చదువు ఎక్కలేదు. మానేశాడు. తండ్రితో కలసి ఫంక్షన్ హాల్లో పనిచేసేవాడు. ఈ క్రమంలో చెడు సహవాసాలు పట్టి వ్యవసనాలకు బానిసైయ్యాడు. అలా వ్యసనాల కోసం 16 ఏళ్లకే దొంగతనాలు మొదలుపెట్టాడు.


కానీ సూర్య దొంగతనాలు చేయటంలో స్మార్ట్. సూర్య రూటే సెపరేటు. ఎలక్ట్రీషియన్‌లా రెడీ అవుతాడు. జేబులో టెస్టర్ పెట్టుకుని నీట్‌గా బైటకొస్తాడు. అగ్జరీ అపార్టుమెంట్లు, విల్లాలే అతని టార్గెట్. వాచ్‌మెన్ దగ్గరకెళ్లి ఎలక్ట్రీషియన్‌ అని చెబుతాడు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పైకి కిందకు తిరుగుతూ రెక్కీ చేస్తాడు. ఏ పోర్షన్లకు తాళాలు ఉన్నాయో గమనిస్తాడు. ఆ ఫ్లాట్స్ నంబర్లు గుర్తు పెట్టుకుంటాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీకి వెళ్తాడు. సౌండ్ కాకుండా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి డేగకళ్లతో వెతుకుతాడు. ఎంత ఖరీదైన వస్తువులు కనిపించినా ఏమాత్రం లెక్కలేదు. కేవలం డబ్బు, బంగారం మాత్రమే నీట్ గా సర్దేసి అంతకంటే నీట్ గా బైటపడతాడు.డబ్బు, బంగారం తప్ప మరే ఇతర విలువైన వస్తువులను ముట్టుకోను కూడా ముట్టుకోడు. ఎంత దర్జాగా ఇంట్లోకొచ్చాడో అంతే దర్జాగా బయటికి వెళ్లిపోతాడు. అది కూడా కేవలం ఆఫీస్ వేళల్లో మాత్రమే దొంగతనాలు చేయడం సూర్యా స్టైల్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు మాత్రమే చోరీలు చేస్తాడు. 5 దాటితే ఆఫీస్ నుంచి వెళ్లుతున్నట్లు దర్జాగా ఇంటికి చేరుకుంటాడు. అదికూడా ఏదో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా వారంలో ఐదు రోజులు మాత్రమే చోరీలు చేస్తాడు.అలా చోరీలు చేసిన సొమ్ముతో వీకెండ్స్‌లో ఎంజాయ్ చేస్తాడు.
ఇలాసూర్య చేసిన చోరీల కేసులు పోలీస్ స్టేషన్లలో 86 కేసులు నమోదైనట్లుగా సమాచారం. గతంలో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడ్డ సూర్య పట్టుబడ్డాడు. పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. కానీ బైటకొచ్చాక చోరీలు మాత్రం మానడు.


అరెస్ట్ అయి 2019 ఫిబ్రవరిలో బయటికొట్టిన కాజాం అలీ ఖాన్ అలియాస్ సూర్య 16 దొంగతనాలు చేశాడు. హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో జరిగిన చోరీ కేసుల్లో గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం అతని నుంచి రూ.52 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బైక్‌లు, మొబైల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు సైబరాబాద్ పోలీసులు.