హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం : RTC 550 ప్రత్యేక బస్సులు

  • Published By: veegamteam ,Published On : September 11, 2019 / 04:26 AM IST
హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం : RTC 550 ప్రత్యేక బస్సులు

సెప్టెంబర్ 12న హైదరాబాద్ నగరంలోని గణనాథులంతా నిమజ్జనం కానున్నారు. ఈ మహా కార్యక్రమం కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యాయి. భక్తుల భద్రతే లక్ష్యంగా అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కన్నుల పండుగగా జరిగనున్న ఈ మహా ఉత్సవాన్ని వీక్షించేందుకు  భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా మహా గణేషులు నిమిజ్జనాలను వీక్షించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా రానున్నారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 

వినాయకుడి భక్తుల కోసం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య 550  ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

బషీర్‌బాగ్‌ నుంచి కాచిగూడ
రాంనగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి కొత్తపేట్
ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిధానీ, లిబర్టీనుంచి  ఉప్పల్
ఇందిరాపార్కు నుంచి ఉప్పల్
సికింద్రాబాద్, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్, మల్కాజిగిరి, లకిడికాఫూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్
కొండాపూర్, రాజేంద్రనగర్, ఆల్‌ఇండియారేడియో నుంచి కోఠీ
ఖైరతాబాద్‌ నుంచి జీడిమెట్ల

అంతేకాకుండా..జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, గాజుల రామారం, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, బోరబండ, తదితర ప్రాంతాలకు  ప్రత్యేక బస్సులు నడువన్నాయి.  ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా  వివిధ రూట్లలో తిరిగే బస్సుల సంఖ్యను కూడా పెంచనున్నారు. అంతేకాక బస్సుల నిర్వహణ కోసం అన్ని శాఖల అధికారులతో పాటు ఆర్టీసీ  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. 
బస్సులు ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆగిపోకుండా బస్సులను కండిషన్ ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. కానీ ఏదైనా సందర్భంలో అనుకోకుండా బస్సులు ఆగిపోయినా..రిపేర్ వచ్చి నిలిచిపోయినా వాటికి వెంటనే రిపేర్ చేసి..అటు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా..ఇటు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీని కోసం సిబ్బందిని సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో మహా వినాయకుల నిమజ్జనోత్స కార్యక్రమం భారీ ఏర్పాట్ల మధ్య..పోలీసుల కనుసన్నల్లో జరగనుంది.