ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ : హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 04:17 AM IST
ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ : హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్

హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చారు. కె.మాణిక్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్ రావు విదేశాలకు వెళ్లడంతో ఇన్ ఛార్జీ కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ జి.రవి కొనసాగుతున్నారు. సీఎం అదనపు కార్యదర్శి, ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ సీఈఓగా ఉన్న మాణిక్ రాజ్‌కు హైదరాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. కె.మాణిక్ రాజ్ ఎంటెక్ అభ్యసించారు. ఇతని వయస్సు 44. 2005 బ్యాచ్‌కి చెందిన వారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ని నియమించాలని ఈసీ ఆదేశాలుజారీ చేసింది. దీనితో కొత్త కలెక్టర్‌గా ఎవరొస్తారనే దానిపై జోరుగా ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట్ ఎస్పీగా ఎం.చేతన, ములుగు ఎస్పీగా ఎస్‌ఎస్‌పీ గణపతిరావు, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా (క్రైమ్స్) రోహిణి ప్రియదర్శిని, ఏటూరు నాగారం ఏఎస్పీగా శరత్ చంద్ర పవార్, మంచిర్యాల డీసీపీగా రక్షిత కే మూర్తి, భద్రాచలం ఏఎస్పీగా రాజేశ్ చంద్ర, మహదేవ్‌పూర్ ఎస్‌డీపీవోగా సాయిచైతన్యలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.