గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 01:15 AM IST
గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

గుడ్ న్యూస్..అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో రైలు పెద్దమ్మ గుడి వద్ద ఆగబోతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ రైలు పలు స్టేషన్ల వద్ద ఆగడం లేదు. దీనితో చాలా మంది ప్రయాణీకులు మెట్రోకు దూరమయ్యారు. దీనిని గమనించిన మెట్రో అధికారులు ఆయా స్టేషన్ల వద్ద పనులు వేగవంతం చేశారు. మార్చి 30వ తేదీ శనివారం నుండి పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుందని మెట్రో అధికారులు వెల్లడించారు. 
Read Also : ఇన్ చార్జ్ వ్యవస్థ రద్దు.. ఓడితే కార్యకర్తలే : బాబు సంచలన వ్యాఖ్యలు

మార్చి 20వ తేదీన అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గంలో మెట్రో ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ స్టేషన్ ప్రారంభాలను పోస్ట్ పోన్డ్ చేశారు. దీని వల్ల మెట్రో ఇక్కడ ఆగడం లేదు. అయితే..శనివారం నుండి మాత్రం పెద్దమ్మ గుడి స్టేషన్ అందుబాటులోకి వస్తుందని..దశలవారీగా మిగతా స్టేషన్లను కూడా ప్రారంభిస్తామని మెట్రో వర్గాలు వెల్లడించాయి. 

  • అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు మొత్తం 10 కిలోమీటర్లు ఉంటుంది. 
  • మధురా నగర్, యూసుఫ్ గూడ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటి వంటి ముఖ్యమైన ప్రాంతాలున్నాయి.
  • మధురానగర్‌ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. 

Read Also : YSRCPలో నయా జోష్ : విజయమ్మ, షర్మిల ప్రచారం