హైదరాబాద్‌లో వర్ష బీభత్సం : బోట్లపై తిరుగుతూ..పాలప్యాకెట్లు అందించిన సిబ్బంది

  • Published By: madhu ,Published On : September 27, 2019 / 04:47 AM IST
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం : బోట్లపై తిరుగుతూ..పాలప్యాకెట్లు అందించిన సిబ్బంది

హైదరాబాద్‌లో నీట మునిగిన కాలనీల్లో జీహెఛ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యటిస్తున్నారు. బోట్లలో తిరుగుతూ..ఇంటింటికి పాలు, కూరగాయాలు, టిఫిన్స్, వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నారు. కనీసం బయటకు రాలేని పరిస్థితిలో పలు కాలనీ వాసులున్నారు. నడుం లోతులో వర్షపు నీరు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనంద్ బాగ్‌లో పలు కాలనీలను జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.

దీంతో వారికి నిత్యావసర సరుకులు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో కనీసం వంట చేసుకొనే పరిస్థితిలో ఉన్నామని తెలియచేస్తున్నారు. బియ్యం, సరుకులు కూడా నీటితో తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నాయి పలు కుటుంబాలు. ఇలాంటి పరిస్థితి కంటిన్యూ కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

మూడు రోజులుగా వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం కొంత తెరిపించిందని అనుకున్న తరుణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. తెల్లవారుజామున 3 గంటల వరకు వాన కురవడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రహదారులపై భారీగా నీరు చేరింది. అర్ధరాత్రి కావడంతో అంతగా ట్రాపిక్ జాం కాలేదు. ప్రధానంగా నివాసాలు, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో కనీసం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అపార్టమెంట్‌ సెల్లార్‌లోకి భారీగా నీరు వచ్చి చేరింది. వాహనాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో చిన్న పిల్లలకు పాలు, ఇతరత్రా ఆహార పదార్థాలు లేకపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎంఎస్ మక్తాలో సుమారు 200 ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 
Read More : ఆకాశానికి చిల్లు : మరో రెండు రోజుల పాటు వర్షాలు