రెండు కాళ్లూ చేతులు కోల్పోయాడు…నోటితో బొమ్మలు వేస్తున్న 9 ఏళ్ల తెలంగాణ అబ్బాయి

రెండు కాళ్లూ చేతులు కోల్పోయాడు…నోటితో బొమ్మలు వేస్తున్న 9 ఏళ్ల తెలంగాణ అబ్బాయి

Hyderabad 9 years boy creates art using mouth : తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన బాలుడి కథ బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మధు కుమార్ అనే తొమ్మిదేళ్ల పిల్లాడు ఒక ప్రమాదంలో కాళ్లూ, చేతులు కోల్పోయాడు.అవయవాలు కోల్పోయాడు కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తన చిన్న నోటితో పెయింట్ బ్రష్ పట్టుకుని అద్భుతమైన బొమ్మలు వేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తన నోటితో అందమైన కళాకృతులను వేస్తున్నాడు.

అన్ని అవయవాలు ఉండి చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు చిన్నారి మధుకుమార్. సంకల్పబలం అనే మాటకు సరిగా అర్థం కూడా తెలియని ఆ పసివాడు ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోనే కోలుకుని కళాకృతులను చిందిస్తున్నాడు. ఎంతోమంది ప్రేరణగా నిలిస్తున్నాడు.

ఈ సందర్బంగా మధు కుమార్ మాట్లాడుతూ..నేను 6th క్లాస్ చదివేటప్పుడు బొమ్మలు వేయటం నేర్చుకున్నాను. బొమ్మలు వేయటం అంటే నాకు ఎంతో ఇష్టం. అలా నాకు ప్రమాదం జరిగిన తరువాత రెండు కాళ్లూ చేతులు కోల్పోయా ఇక నేను బొమ్మలు వేయలేనేమో అని చాలా బాధపడ్డాను. కానీ.. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నోటితో బొమ్మలు వేయటం నేర్పించటంతో నేనిప్పుడు బొమ్మలు వేయగలుగుతున్నానని చెప్పాడు.

కాగా..మెదక్ జిల్లాలోని మున్నల్లె మండలంలోని కమ్కోల్ గ్రామంలో తన కుటుంబంతో నివసించే మధు కుమార్ గత సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంటి టెర్రస్ పై ఆడుకుంటూ..అనుకోకుండా..ఇనుప రాడ్ కు టచ్ అయిన విద్యుత్ లైన్లతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో మధు కుమార్ రెండు కాళ్లూ చేతులు కోల్పోయాడు. తీవ్రమైన గాయాలతో చచ్చి బతికినంత పనయ్యాడు. కానీ బతికి బైటపడ్డాడు. కానీ అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకున్నాడు.

మధు కుమార్ తండ్రి తుల్జారామ్ పంక్చర్ షాపు నడుపుతున్నాడు. కొడుకుకు ప్రమాదం జరిగిందని తెలిసి నేను నా భార్య ప్రమీలా తల్లడిల్లిపోయాం. వెంటనే గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చాం. నాకు మధు కుమార్ తో పాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చిన్నపాటి ఆదాయంతో బతికే మా కుటుంబానికి మధుకు అంత పెద్ద ప్రమాదంతో చాలా భయపడిపోయాం. వాడి జీవితం ఏమైపోతుందోననీ..అసలు బ్రతుకుతాడా మాకు దక్కుతాడా లేదాని తల్లడిల్లిపోయాం. కానీ మా కొడుకు మాకు దక్కాడు. కానీ వాడికి బొమ్మలు వేయటమంటే చాలా ఇష్టం కానీ రెండు కాళ్లూ చేతులు కోల్పోయాక వాడు బొమ్మలెలా వేస్తాడని బాధపడ్డాం.

కానీ కళాకారుడు డాక్టర్ సముద్రాల హర్ష నోటితో పెయింటింగులు వేయటం నేర్పిస్తారని తెలిసి..ఆయన దగ్గరకు తీసుకెళ్లగా..నాకొడుకు కొత్త ఆశలు చిగురించాయి. అలా అతనితో నోటితో బొమ్మలు వేయటం నేర్చుకుని అందమైన బొమ్మలు వేస్తున్నాడని కొడుకు గురించి తెగ మురిసిపోతు చెప్పాడు మధు కుమార్ తండ్రి తుల్జారామ్. చిరంజీవి వంటి చాలా మంది పెద్ద ప్రముఖుల దృష్టిని మధు ఆకర్షించాడని తెలిపాడు.

అలా నోటితో పెయింటింగ్ లు వేస్తే మధు కుమార్ గురువు హర్షతో పాటు పలు పదర్శనల్లో పాల్గొన్నాడని తెలిపాడు. మధు కుమార్ కు పెయింటింగ్ ల పట్ల ఉన్న మక్కువ చాలా స్ఫూర్తిదాయకమని కళాకారుడు సముద్రాల హర్ష అభినందించారు.