హైదరాబాద్‌ లాక్‌డౌన్.. ఒక్క రోజే 2వేలకు పైగా వాహనాలు సీజ్

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 02:50 AM IST
హైదరాబాద్‌ లాక్‌డౌన్.. ఒక్క రోజే 2వేలకు పైగా వాహనాలు సీజ్

లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులకు తప్ప అస్సలు బయటకి రావద్దని వెల్లడించారు. అవసరం లేని పనులకు కూడా సరదాగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికి వినకుండా అందరూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే (మార్చి 23, 2020) 2వేలకు పైగా వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. వీటిలో 1058 బైక్‌లు, 948 ఆటోలు, 429 కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, 45 ఇతర వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు.

సోమవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కఠన చర్యలు ఏర్పాటు చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 73 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మొత్తం 2480 వాహనాలను సీజ్‌ చేసినట్లు ట్రాఫిక్‌ విభాగం అదనపు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.  

లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై తెలంగాణ పోలీసులు కొరడా విసిరారు. ప్రభుత్వం జారీ చేసిన GO-45, 46 ప్రకారం.. లాక్‌డౌన్‌ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరాన్ని కరోనా ఫ్రీ నగరంగా ఉంచాలని కోరారు.

Also Read | ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు: వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులు.. నాలుగు రోజుల్లోనే లక్ష మందికి!