ఇథియోపియాలో కారు ప్రమాదం : హైదరాబాద్ వాసి దుర్మరణం

ఇథియోపియాలో కారు ప్రమాదం : హైదరాబాద్ వాసి దుర్మరణం

ఇథియోపియాలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ వాసి ఉన్నారు. హిమాయత్ నగర్ కు చెందిన పీవీ శశిధర్ గా

ఇథియోపియాలో కారు ప్రమాదం : హైదరాబాద్ వాసి దుర్మరణం

ఇథియోపియాలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ వాసి ఉన్నారు. హిమాయత్ నగర్ కు చెందిన పీవీ శశిధర్ గా

ఇథియోపియాలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ వాసి ఉన్నారు. హిమాయత్ నగర్ కు చెందిన పీవీ శశిధర్ గా గుర్తించారు. దీనిపై శశిధర్ కుటుంబసభ్యులు భారత విదేశాంగ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శశిధర్ మృతదేహం భారత్ కు రప్పించే ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు విన్నవించారు.  
Read Also : రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!

శశిధర్ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేస్తుంటారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఫిషరీస్ వ్యాపారం చేస్తున్నారు. మైనింగ్ వ్యాపారం కోసం ఆయన తరుచుగా ఇథియోపియా వెళ్లి వస్తుంటారు అని కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మరో వార్త కూడా వినిపిస్తోంది. కొందరు దుండగులు కారుని అడ్డగించి నిప్పు పెట్టారని తెలుస్తోంది. కారులో ఉన్న ఐదుగురు.. మంటల్లో సజీవదహనం అయ్యారని చెబుతున్నారు. శశిధర్ తన నలుగురు స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని వార్తలు వస్తున్నాయి. అసలు ఏది నిజం అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

×