అమెరికాలో కత్తిపోటుకు గురై చనిపోయిన హైదరాబాదీ

అమెరికాలో కత్తిపోటుకు గురై చనిపోయిన హైదరాబాదీ

Hyderabad: యునైటెడ్ స్టేట్స్‌లోని జార్జియాలో 37ఏళ్ల హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని హత్య చేశారు. ఇంటి బయట పడి ఉన్న మృతదేహానికి పలు కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కుటుంబం కోరుతుంది.

మొహమ్మద్ ఆరిఫ్ మొహిఉద్దీన్ అనే వ్యక్తి జార్జియాలో పదేళ్లుగా గ్రోసరీ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ‘నాకు నా తండ్రికి ఎమర్జెన్సీ వీసా ఇప్పిస్తే.. నా భర్త అంత్యక్రియలు పూర్తి చేసుకుంటామని గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని మెహనాజ్ ఫాతిమా చెప్పింది.



స్టోర్ లో ఒక ఉద్యోగి ఉన్న సమయంలో దాడి చేసిన దుండగులు దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపిస్తుంది.

‘ఆదివారం ఉదయం 9గంటలకు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక అరగంటలో మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడు. కానీ, నాకు ఎటువంటి కాల్ రాలేదు. కాసేపటి తర్వాత మా వదిన ఫోన్ చేసి నా భర్తను గుర్తు తెలియని వ్యక్తి పలు మార్లు కత్తితో పొడిచి హత్య చేశాడని చెప్పింది. అతని డెడ్ బాడీ జార్జియా హాస్పిటల్ లో ఉంది. అతనితో పాటు వేరే ఫ్యామిలీ పర్సన్ ఎవరూ లేరు’ అని ఫాతిమా చెప్పింది.
https://10tv.in/tejaswini-murder-case-after-post-mortem-report-tejaswini-dead-body-sent-to-native-village/
తెలంగాణకు చెందిన మజ్లీస్ బచావో తరీక్ ప్రతినిధి ఉల్లాహ్ ఖాన్.. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌కు, ఇండియన్ ఎంబస్సీకు లేఖ రాసి కుటుంబానికి సాయం చేయాలని కోరాడు.