ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన…ఫైన్ చెల్లించిన మేయర్

  • Published By: venkaiahnaidu ,Published On : February 4, 2019 / 05:52 AM IST
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన…ఫైన్ చెల్లించిన మేయర్

నో పార్కింగ్ ప్లేస్ లో తన వాహనాన్ని పార్కింగ్ చేయడం తప్పేనని హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. రాంగ్ పార్కింగ్ విషయంలో తనను ప్రశ్నిస్తూ నెటిజన్లు  పోస్టింగ్ చేయడంపై మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఏ స్థాయి వ్యక్తినైనా నిలదీసే పరిస్థితులు రావడం అభినందనీయమని తెలిపారు. అయితే తన డ్రైవర్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ తప్పు చేయలేదని అన్నారు. సిటీలోని సమస్యల పరిష్కార విషయమై తాము తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఇది జరిగిందని.. అయినప్పటికీ ఇది తప్పేనని, రూల్స్ అంరికీ ఒకటేనని, మనమందరం రూల్స్ పాటించాలని ఆయన ట్వీట్ చేశారు.

తమ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిదన్న విషయాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తిని తాను అభినందిస్తున్నానని, తనకు ట్రాఫిక్ పోలీసులు  విధించిన జరిమానా చెల్లించినట్లు తెలిపారు. తప్పు జరిగిందని మీ దృష్టికి వచ్చినప్పడు సైలెంట్ గా కూర్చోకుండా ఉండకూడదనడానికి అందరికీ ఇదొక ఉదాహరణగా తీసుకోవాలని, అందరూ రూల్స్ పాటించాలని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.

మేయర్ బొంతురామ్మోహన్ కారు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో మేయర్ కారు నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి ఉంది. గురువారం మధ్యాహ్నాం ఏపీ09సీ9969 నంబర్ గల ఫార్చ్యునర్ కారులో మేయర్ మాదాపూర్ వెళ్లారు. ఇనార్బిట్ మాల్ దగ్గర్లోని ఐ ల్యాబ్ దగ్గర నో పార్కింగ్ ఉన్న చోట తన కారుని ఆపారు. దీన్ని గమనించిన ఓ నెటిజన్ కారు ఫోటో తీసి ట్రాఫిక్, సైబరాబాద్ పోలీస్, తెలంగాన డీజీపీకి ట్విట్టర్ లో కంప్లెయింట్ చేశాడు. దీంతో వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐ ల్యాబ్ దగ్గరకు చేరుకొని మేయర్ కారుకి ఫైన్ విధించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో భాగస్వామ్యమవుతున్న నెటిజన్లను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు.