దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం

దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్‌ స్ప్రే

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 03:46 PM IST
దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం

దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్‌ స్ప్రే

దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారికి గుడ్ న్యూస్ వినిపించింది. పెప్పర్ స్ప్రేలతో మెట్రో రైల్లో ప్రయాణించేందుకు మహిళలకు అనుమతి ఇచ్చింది. మహిళలు తమ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే వెంట తెచ్చుకోవచ్చని చెప్పింది. మహిళల దగ్గర పెప్పర్ స్ప్రే ఉంటే సీజ్ చేయొద్దని మెట్రో భద్రతా దళాలకు ఇప్పటికే సూచనలు ఇచ్చారు అధికారులు.

షాద్‌నగర్‌ సమీపంలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దిశ ఘటనతో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో వర్గాలు చెప్పాయి.

మెట్రో రైల్లో సాంకేతిక కారణాలతో పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఎవరైనా వీటిని తీసుకొస్తే చెకింగ్‌ పాయింట్ల దగ్గరే వాటిని సీజ్ చేసేవారు. కానీ ఇకపై మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే క్యారీ చేయొచ్చని ఆదేశాలు జారీ చేశారు. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మహిళలు సులువుగా తమను తాము రక్షించుకునేందుకు పెప్పర్ స్ప్రే ఉపయోపడుతోంది. మెట్రో అధికారుల నిర్ణయం పట్ల మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

దిశ ఘటన నేపథ్యంలో పెప్పర్ స్ప్రేకి అనుమతిస్తూ బెంగళూరు మెట్రో మంగళవారం(డిసెంబర్ 3,2019) నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా అదే బాటలో వెళ్లింది.