కరోనా ఎఫెక్ట్ : హైదరాబాద్ మెట్రో ట్రైన్స్‌లో క్రిమిసంహార మందులు స్ప్రే

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 10:29 AM IST
కరోనా ఎఫెక్ట్ : హైదరాబాద్ మెట్రో ట్రైన్స్‌లో క్రిమిసంహార మందులు స్ప్రే

చైనాలో పుట్టి భారత్ కు కూడా వ్యాపించిన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంపై కూడా పడింది. హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో అతి ముఖ్యమైనది మెట్రో రైల్. కరోనా భయంతో మెట్రో రైల్ ప్రయాణంపై పడకూడదనే ఉద్ధేశంతో మెట్రో అధికారులు రైలులో అన్ని స్టేషన్లలోను మెట్రో రైల్ కోచ్ లలో క్రిమిసంహార మందులను పిచికారీ చేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకూ వేలాదిమంది హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణిస్తుంటారు.ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులు మెట్రో రైల్‌లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. దీంతో కరోనా భయంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెట్రో స్టేషన్లతో పాటు మెట్రో కోచ్ లలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. కోచ్‌లో ఉండే సీట్లు..నిలబడే ప్రయాణీకుల కోసం సపోర్ట్ గా ఏర్పాటు చేసిన హ్యాండిల్స్ లకు కూడా పిచికారీ చేస్తున్నారు.  

కాగా..హైదరాబాద్ లో ఓ టెకీకి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణీకుల కోసం మెట్రో రైలు ఎండీ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేయటంత మంత్రి ఆదేశాల మేరకు మెట్రో సిబ్బంది కోచ్ ల్లోను…స్టేషన్లలోను క్రిమిసంహార మందులను పిచికారీ చేస్తున్నారు.