హైదరాబాద్‌లో తొలిసారి : అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీస్

హైదరాబాద్‌లో తొలిసారి : అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీస్

హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు సునాయాసంగా చేరుస్తున్న మెట్రో సర్వీస్‌లో మరో మార్పు రానుంది. నగరంలో తొలిసారి అండర్ గ్రౌండ్ మెట్రోను అమలులోకి తీసుకురానున్నారు. సిటీ మొత్తం ఇప్పటివరకూ జరిగిన మెట్రో రైలును రోడ్డుపైన పిల్లర్లు నిర్మించి దానిపైన తయారు చేశారు. 

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు మాత్రం నేలపైనే మెట్రో ట్రాక్ ఉండనుందని కొద్ది రోజులు ముందు వెల్లడించారు. ఇందులో మరో మార్పు తీసుకొచ్చి ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రోసర్వీస్ అండర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్నారట. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి బయల్దేరే ఈ ప్రయాణం 3కిలో మీటర్లు ప్రయాణించి ఎయిర్ పోర్టుకు చేరుతుంది. 

ఎయిర్ పోర్టుకు చేరే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీఎస్ రెడ్డి శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోన్న ఈ ప్రాజెక్టుకు త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అన్నారు.