ప్లేట్ ఇడ్లీ ధర అక్షరాలా రూ. 700..!!

ప్లేట్ ఇడ్లీ ధర అక్షరాలా రూ. 700..!!

Hyderabad Private Hospital bill Plate Idly Rs. 700: ప్లేట్ ఇడ్లీ ధర ఎంతుంటుంది? రూ.25 ఉంటుంది.అదే ఏ ఫైవ్ స్టార్ హోటల్స్ లో అయితే మహా అయితే రూ.100 నుంచి రూ.150 ఉండొచ్చు..కానీ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మాత్రం ప్లేటు ఇడ్లీ ధర రూ. అక్షరాలా రూ.700లు..!! ఇది జోక్ కాదు నిజంగా నిజం..అసలే కరోనాకష్టాలో ప్రజలు ఉంటే ఈ భారీ రేట్లతో రోగులకు ఆస్పత్రి చుక్కలు చూపిస్తోంది.

కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళన చెందుతుంటే హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రజలను నిలువునా దోచేస్తున్నాయి. ఆరోగ్య శ్రీ ఉన్నా పట్టించుకోకుండా కరోనా చికిత్సకు రూ. లక్షల్లో దండుకుంటున్న ఘటనలు జరుగుతున్నా వాటిని బయటకు చెప్పటానికి ఎవ్వరూ ముందుకు రారు. కారణం భయం. తమకు ఏం జరుగుతుందోననే భయం.

ముఖ్యంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు ధనదాహం చూస్తుంటే బిల్లులు చూస్తే గుండె గుబేలుమంటోంది. చిన్నపాటి చికిత్స కోసం వెళ్లినా కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని తేల్చి చెప్పేస్తున్నాయి. ఇక ఎమర్జీన్సీ సేవల పేరుతో భారీ మొత్తంలో ఫీజులు గుంజుతున్నాయి.

ఈక్రమంలో తాజాగా ఓ రోగికి ఓ ప్రైవేటు ఆస్పత్రి వేసిన బిల్లును చూస్తే హార్ట్ ఎటాక్ రావటం ఖాయం. ఒకే ఒక్క ప్లేట్ ఇడ్లీకి అక్షరాలా 700 రూపాయల బిల్లును వసూలు చేసింది ఓ కార్పోరేట్ ఆస్పత్రి. వాళ్లు వేసిన ఆ బిల్లును రోగి తరుపు బంధువు ట్విట్టర్ లో షేర్ చేయటంతో ఇది వెలుగులోకి వచ్చింది. ” ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్లేట్ ఇడ్లీకి 700 రూపాయల బిల్లు వేసింది. ఆ ఇడ్లీలు ఏమైనా స్వర్గం నుంచి వచ్చాయా? ఇడ్లీలు బిల్లే కాదు మిగతా వాటి గురించి ఏంటి..” అంటూ అతడు ప్రశ్నించాడు సోషల్ మీడియా వేదికగా..

ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ..ఆ ఆస్పత్రే కాదు పలు ప్రైవేటు ఆస్పత్రుల తీరు ఇలాగే ఉందని ఖర్మకాలి ఆస్పత్రికి వెళితే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి పరిస్థితులు ఉంటున్నాయని అంటున్నారు. అసలు మానవత్వమే లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

ఈ ఇడ్లీలు స్పెషల్ గా ఆకాశాన్ని నుంచి తెప్పించి ఉంటారు అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు తమకు ప్రైవేట్ ఆస్పత్రుల వల్ల జరిగిన అన్యాయం గురించి చెప్పుకోని వాపోతున్నారు. ఇలా ఎవరి బాధలు వాళ్లు చెప్పుకుని వాపోతున్నారు.