చదువురాని స్టూడెంట్స్ మాకొద్దు : 30 మంది విద్యార్దులకు టీసీ ఇచ్చిన హెడ్ మాస్టర్

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 06:00 AM IST
చదువురాని స్టూడెంట్స్ మాకొద్దు : 30 మంది విద్యార్దులకు టీసీ ఇచ్చిన హెడ్ మాస్టర్

హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థుల విషయంలో చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. బాగా చదవలేని విద్యార్ధులు మాకొద్దు అంటూ 30మందికి టీసీలు ఇచ్చేశాడు. అంతేకాదు..మరో 10మంది విద్యార్ధులను డిటైన్ చేశాడు హెడ్ మాస్టర్ సుమన్. చదువులో డల్ గా ఉండి చదవలేకపోతున్న విద్యార్థులు మాకు అవసరం లేదు..బాగా చదివి ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులే మా స్కూల్లో ఉండాలి అంటు 30మంది విద్యార్ధులకు టీసీలు ఇచ్చేశాడు. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

చదవలేని విద్యార్దులకు చదువు బాగా వచ్చేలా చెప్పాలి కానీ..ఈ వంకతో మధ్యలో వారికి టీసీలు ఇచ్చేస్తే ఎలా…వారి భవిష్యత్తు ఏంటి అంటే ప్రశ్నిస్తున్నారు. దీంతో డిప్యూటీ డీఈవో హెడ్ మాస్టర్ చేసిన పనిపై విచారించేందుకు స్కూల్ కు చేరుకున్నారు.  

ర్యాంకులు..టార్గెట్లు ఇదే నేటి ప్రతీ స్కూల్ విధానం. మంచి ర్యాంక్ వచ్చినవారిని చేర్చుకోవటానికే విద్యా సంస్థలు ముందుకొస్తాయి. కానీ తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్ధులను చేర్చుకోవాలంటే..వేలు..లక్షల్లో ఫీజులు గుంజుతుంటాయి ప్రయివేటు స్కూల్స్ ..కాలేజీలు.  బాగా చదివే విద్యార్ధులకు చదువు చెప్పటం అది తమదేనని గొప్పలు చెప్పుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. తెలివి గల విద్యార్థులకు చదువు చెప్పటం గొప్పకాదు..చదువులో కాస్త వెనుకబడినవారికి మంచి చదువు చెప్పటంపై మాత్రం ఏ స్కూల్ యాజమాన్యాలు శ్రద్ధ చూపటంలేదు అనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పాలి. చదువు రాని విద్యార్ధులు మాకు వద్దంటూ 30మందికి టీసీలు ఇచ్చిన హెడ్ మాస్టర్ ఘటనపై విచారణ చేపట్టేందుకు స్కూల్ కు చేరుకున్నారు డిప్యూటీ డీఈవో.