రెండూ మనవే : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవస్థానం 

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 06:05 AM IST
రెండూ మనవే : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవస్థానం 

జీఎంఆర్  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం  అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచంలో డెవలప్ అవుతున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రపచంలోనే అభివృద్ధి చెందుతున్న ఎయిర్ పోర్ట్ గా గుర్తింపు పొందింది. ప్రయాణీకుల వృద్ధిరేటు పరంగా ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచింది.

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించిన తాజా సర్వేలో ఇది వెల్లడైంది. 2018లో ఐదోస్థానంలో నిలవగా..2019లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. 15 మిలియన్లకుపైగా వార్షిక ప్రయాణీకుల విభాగంలో 21.9 శాతం వృద్ధితో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరోసారి నిలిచింది. 

29.1 శాతం వృద్ధితో బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా..టర్కీలోని ఆంటిల్యా ఎయిర్‌పోర్టు రెండో స్థానంలో నిలిచింది. రష్యా ఉకోవు ఎయిర్‌పోర్టు నాలుగో స్థానాన్ని దక్కించుకోగా..చైనాలోని జినాన్ ఎయిర్‌పోర్టు ఐద స్థానంలో నిలిచిదని  ఏసీఐ తన నివేదికలో తెలిపింది. 

అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్  ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య డెస్టినేషన్ కమ్ టూరిస్ట్ ఏరియాగా పేరుతెచ్చుకుంది. 
ప్రతీ రోజు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి  29 ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు.. దేశ, విదేశాల్లోని 69 ప్రదేశాలకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. 2015-2019 మధ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సంవత్సరానికి 20 నుంచి 21.9 శాతం వృద్ధిని  కనబరిచింది. ప్రతీ రోజూ ఈ ఎయిర్ పోర్ట్ నుంచి 60 వేల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తుండగా..500లకుపైగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 

2018లో ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఎక్కువగా అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌లకు వెళ్ళగా, దేశీయంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకు ఎక్కువగా ప్రయాణించినట్లుగా ఏసీఐ తెలిపింది. 

ఇటీవల విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక యాత్ర పథకం కింద దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫేస్ రికగ్నైజేషన్ ట్రయల్స్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. దేశంలో బ్యాగ్‌ట్యాగ్‌లను తొలగించిన ఫస్ట్ ఎయిర్ పోర్ట్ కూడా ఇదే కావటం మరో విశేషం. హ్యండ్ బ్యాగేజ్ తో ప్రయాణించే ప్రయాణీకుల కోసం ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెకిన్ ప్రవేశపెట్టిన ఘనత కూడా జీఎంఆర్‌కే దక్కుతుంది. ఏవియేషన్ మార్కెట్ సరళీకరణ, బలోపేతమవుతున్న ఎకనామిక్ ఫండమెంటల్స్ తో  భారత్ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న విమానయాన మార్కెట్‌గా ఎదుగుతోందని ఏసీఐ వరల్డ్ డైరెక్టర్ జనరల్ మిస్ ఏంజెలా అభిప్రాయపడ్డారు.