నా భర్తను చంపి మంచి పనే చేశా..అలా చేసినందుకు బాధాలేదు..పశ్చాత్తాపం అంతకంటే లేదు..!!

10TV Telugu News

shocking truths by wife in her husband murder case : హైదరాబాద్ లోని పాతబస్తీలో భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టిన రెండో భార్య కేసు దృశ్యం సినిమాను తలపిస్తోంది. ఆ సినిమాలో కూతుర్ని వేధించే ఓ యువకుడిని చంపి ఇంట్లోనే పాతిపెడతారు. అచ్చు అటువంటి ఘటనే జరిగింది హైదరాబాద్ లో. భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టిన రెండో భార్య కేసులో షాకింగ్ నిజాలు బయటికొస్తున్నాయి. పోలీసుల విచారణలో నిందితులురాలు షాకింగ్ విషయాలను బైటపెట్టింది. ‘‘నా భర్తను చంపి నేను మంచి పనే చేశాను…అతడిని చంపినందుకు నాకేమీ బాధలేదు. పశ్చాత్తాపం అంతకంటే లేదు. నా పిల్లలు అనాథలయ్యారన్న బాధ తప్పితే ఇంకేం బాధ లేదు. నా పిల్లల కోసం..వారి క్షేమం కోసమే ఈ హత్య చేశాను‘ అంటూ భర్తను చంపి ఇంటిలోనే పూడ్చి పెట్టిన భార్య నౌసిన్ బేగం చెబుతున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

కాగా..హైదరాబాద్ లోని వనస్ధలిపురంలో రెండ్రోజుల క్రితం ‘భర్తను చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన రెండో భార్య‘కు సంబంధించిన కేసు కలకలం రేపింది. హైదరాబాద్ లోని పాతబస్తీ యాకత్ పురాకు చెందిన నౌసిన్ బేగం అనే 32 ఏళ్ల మహిళకు పెళ్లయింది. నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. సంసారం బాగానే సాగుతోంది అనే క్రమంలో భర్తతో నౌసిన్ కు గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు పెరిగీ పెరిగీ విడాకులు తీసుకునేవరకూ వెళ్లారు. అలా తరచూ భర్తతో గొడవలు అవుతుండటంతో నౌసిన్ భర్తకు విడాకులు ఇచ్చింది. ఐదుగురు పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈక్రమంలోనే నౌసిన కు గగన్ అగర్వాల్ అనే 38 ఏళ్ల వ్యక్తితో పరియయం అయ్యింది. గగన్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండటంతో ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయను అనుకున్నారు. అలా వారి పరిచయం పర్సనల్ విషయాలు మాట్లాడుకునేవరకూ వెళ్లి వెళ్లీ అదికాస్తా వివాహం చేసుకునేవరకూ వెళ్లింది. భర్త వదిలేసిన నౌసిన్, భార్య వదిలేసిన గగన్ జూన్ నెలలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.

అలా నౌసిన ఐదుగురు పిల్లలతో సహా వనస్ధలిపురంలో వివేకానందనగర్ కాలనీలో కాపురం పెట్టారు. కొత్త మురిపెంతో కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. క్రమేపీ గగన్ తీరులో మార్పులొచ్చాయి. అతని కన్ను నౌసిన్ కు మొదటి భర్త వల్ల కలిగిన నలుగురు కూతుళ్లపై పడింది. లో పెద్ద పిల్లలిద్దరినీ వేధింపులు మొదలు పెట్టాడు. వాడి కామం ఎంత వరకూ వెళ్లిందంటే ఆరేళ్ల కూతురుని కూడా వదలకుండా..వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండేవాడు. అది గమనించిన నౌసిన భరించలేకపోయింది. తట్టుకోలేకపోయింది. నీకు వాళ్లు కూతుళ్లులాంటివాళ్లే కదా?…అటువంటి వాళ్లను ఆ దృష్టితో ఎలా చూస్తావు? అంటూ ప్రశ్నించింది. దానికి గగన్ కూతుళ్లు లాంటి వాళ్లే గానీ కూతుళ్లు కాదు కదా? అంటూ తిక్కగా సమాధానం చెప్పేసరికి నౌసిన్ ఆగ్రహం పట్టలేకపోయింది. భర్తతో గొడవపడింది. అలా ఆడపిల్ల గురించి భర్తతో ఆమె తరచూ గొడవపడేది. తన ఆడపిల్లల బాధను అర్థం చేసుకుని వేయి కళ్లతో కాచుకునేది. రెండో భర్తను కూడా వదిలేస్తే తన పిల్లల గతి ఏమవుతుందోనని ఆందోళన పడింది. కానీ తన పిల్లల భద్రతకంటే ఎవరూ ఎక్కువ కాదనుకుంది. అలా భర్త కళ్లనుంచి బిడ్డల్ని కాచుకునేది. ఈక్రమంలో వాళ్ల ఇంటికి తరచూ వచ్చే సునీల్ అగర్వాల్ అనే వ్యక్తితో తన బాధ గురించి చెప్పుకుంది.

ఈక్రమంలో గత ఫిబ్రవరి 8 రాత్రి గగన్, సునీల్ కలిసి ఇంట్లోనే కూర్చుని మద్యం తాగారు. ఆ మద్యం మత్తులో గగన్, తన భార్య నౌషీమ్ తో గొడవపడ్డాడు. దీంతో అప్పటికే భర్తమీద పీకల్లోతు కోపంలో నౌసిన్ కూడా భర్తతో గొడవకు దిగింది. భర్త మాటలకు నౌసిన్ కు కోపం తారాస్థాయికి చేరుకుంది. నవ్వసలు మనిషివేనా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. దానికి అసలే మద్యం మత్తులో ఉన్న గగన్ భార్యను కొట్టబోయాడు. దాన్ని అడ్డుకున్న నౌసిన్ ఇంట్లో ఉన్న ఓ కత్తితో భర్త గొంతులో దించేసింది. అలా ఆమె కోపం తగ్గేదాకి పదే పదే పొడిచింది. దీంతో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన భర్తను చూసి నౌసిన కు ఏం చేయాలో పాలు పోలేదు. పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకుంటే ఇలా జరిగిందేంటీ దేవుడా అనుకుంటూ ఏడ్చింది.

తన కళ్లముందే జరిగిన ఘటనకు సునీల్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత గగన్ శవాన్ని మాయం చేసేందుకు నౌషీమ్ కు సహకరించాడు. ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్ నిర్మించడానికి ఓ పదిహేను రోజుల క్రితం గుంతను తవ్వినట్టు గుర్తుకొచ్చింది. దీంతో గగన్ అగర్వాల్ మృతదేహాన్ని ఇద్దరూ కలిసి ఆ గుంతలో పూడ్చిపెట్టారు. పైన రాళ్లు, కంకర, ఇటుకముక్కలు, అక్కడున్న చెత్తా చెదారం అంతా వేసి గుంతను పూడ్చేశారు. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆతరువాత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పుట్టింటికి వెళ్లినప్పటికీ నౌషీమ్ రోజూ తన ఇంటికి వచ్చేది. ‘‘నీ భర్త కనిపించట్లేదు.. నువ్వు మాత్రమే వస్తున్నావేంటీ? అని ఇరుగు పొరుగువాళ్లు అడుగుతుంటే..నా భర్త కనిపించట్లేదు..పోలీసులకు ఫిర్యాదు చేశాను..కానీ ఇంట్లో పిల్లి ఉంది కదా..దానికి పాలు పోయాలి.‘ అంటూ చెప్పుకొచ్చేది. అద్దెకు ఉండేవాళ్లకు తనమీద అనుమానం రాకుండా జాగ్రత్త పడేది.వారితో ఏమాత్రం కంగారు పడకుండా మాట్లాడేది.

అలాగే ముందు జాగ్రత్తగా భర్తను పూడ్చి పెట్టిన గుంతమీద నీళ్లు పోసేది. నీళ్లు పోసాకి గుంతలో ఇటుకలు, కంకర ఏమైనా కిందకు దిగినట్లుగా అనిపిస్తే వాటిమీద రాళ్లు రప్పలు వేసి మళ్లీపూడ్చేది. పూడ్చి పెట్టిన శవం దుర్వాసన వస్తోందా? అని కూడా గుంత దగ్గర వాసన చూసేది. అలా కొంచెం దూరం వెళ్లి వాసన పీల్చేది. అలా ప్రతీరోజు అక్కడకు వెళ్లేంది. గుంతమీద పోసేదాన్ని అని పోలీసుల విచారణలో నౌసిన్ తెలిపింది. పోలీసుల విచారణలో ఆమె దోషి అని నిర్ధారించుకున్నారు. కానీ భర్తను చంపినందుకు ఆమెకు ఎటువంటి బాధపడలేదని పోలీసులు గుర్తించారు. అదే విషయాన్ని అడుగగా..’నా భర్తలాంటి మృగాన్ని చంపి నేను మంచి పనే చేశాను. అతడిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నారు. గానీ అతన్ని చంపినందుకు కాదు. అంటూ ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చెప్పింది. నా పిల్లలు అనాథలయ్యారన్న బాధ మాత్రమే ఉంది. ఈ హత్యను నేను మాత్రమే చేశాను. పూడ్చి పెట్టడానికి మాత్రమే సునీల్ సాయం తీసుకున్నాను.’ అని నౌషీమ్ దృఢంగా చెబుతుండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం నౌసిన కు సహకరించిన..పరారీలో ఉన్న సునీల్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

కాగా..తన అన్న అగర్వాల్ కనపడటక పోవటంతో గగన్ తమ్ముడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి..కేసు వనస్ధలిపురం పోలీసులు కేసును ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని అక్కడకు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నౌసీన్ ను ప్రశ్నించారు. కానీ ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు అమెను తమదైన స్టైల్లో విచారించే సరికి తానే భర్తను చంపానని తన పిల్లల్ని అతడి నుంచి కాపాడుకోవటానికి చంపానని చెప్పుకొచ్చింది. రోజు గొడవలు పడుతున్నభర్తను తానే హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టానని చెప్పింది.

10TV Telugu News