ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 03:54 AM IST
ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య దిశల నుండి శీతల గాలులు వీస్తున్నాయి. 
తెలంగాణలో మూడు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి తదితర ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. చలి నుండి రక్షించుకొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
జనవరి 30వ తేదీ రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ – 7, హైదరాబాద్, రామగుండం, హన్మకొండ -9, నిజామాబాద్ -10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.