వడ్డీ రేటు మార్చిన ఐసీఐసీఐ : వినియోగదారుడికి 55వేలు చెల్లించాలని ఆదేశం

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 03:16 AM IST
వడ్డీ రేటు మార్చిన ఐసీఐసీఐ : వినియోగదారుడికి 55వేలు చెల్లించాలని ఆదేశం

ఐసీఐసీఐకి ఓ జిల్లా వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీని రీసెట్టింగ్ చేసిన విషయం వినియోగదారుడికి చెప్పడంలో బ్యాంకు విఫలమైందని,దీంతో సదరు వినియోగదారుడికి 55వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐకి సూచించింది.

2006లో హైదరాబాద్ లోని గచ్చిబౌలి దగ్గర్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లోని ఐసీఐసీఐ బ్యాంకులో రాజ్ కుమార్ అనే వ్యక్తి 30లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడు. లోన్ మంజూరు అయ్యే సమయంలో వడ్డీ రేటు 9.25శాతం ఫిక్స్ డ్ గా ఉందని,120నెలలకు ఈఎమ్ఐ కింద నెలకు తాను రూ.38,410 చెల్లిస్తూ ఉన్నానని, అయితే 120నెలల తర్వాత ఈఎమ్ఐ కలెక్ట్ చేయడం బ్యాంకు ఆపివేయాల్సిందని,అయితే బ్యాంకు అలా చేయలేదని,136నెలల తర్వాత తాను అప్పటివరకు 49.37లక్షలు చెల్లించినట్లు గుర్తించానని,వెంటనే బ్యాంకు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లానని తెలిపాడు.

కేవలం 17.93లక్షలు మాత్రమే అసలు మొత్తంనుంచి తగ్గించబడ్డాయని,ఇంకా చెల్లించాల్సి రూ.28.73లక్షలు ఉందని షాక్ అయ్యానని రాజ్ కుమార్ తెలిపారు. లోన్ పై వడ్డీ రేటు 14.85శాతంగా ఉండటం చూసి షాక్ అయ్యానన్నారు. వడ్డీ రేటు మార్చిన విషయం గురించి బ్యాంకు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రాజ్ కుమార్ తెలిపాడు. ఆయన విజ్ణప్తులను బ్యాంకులు పట్టించుకోకపోడంతో ఆయన వినియోగదారుల ఫోరంలో కంప్లెయింట్ చేశాడు.

అయితే ఫ్లోటింగ్(కదులుతూ ఉండే)వడ్డీ రేటుకి లోన్ తీసుకునేటప్పుడు రాజ్ కుమార్ అంగీకరించాడని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. వాదనలు విన్న కన్జ్యూమర్ ఫోరమ్ రాజీవ్ కుమార్ కి ఐసీఐసీఐ బ్యాంకు 55వేలు చెల్లించాలని తెలిపింది.