ప్రపంచంలోనే మనం స్పెషల్: భారతీయులకి చిన్న బ్రెయిన్స్

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 04:55 AM IST
ప్రపంచంలోనే మనం స్పెషల్: భారతీయులకి చిన్న బ్రెయిన్స్

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) పరిశోధకులు మొదటిసారిగా ఇండియన్ బ్రెయిన్ అట్లాస్ తయారుచేశారు. ఈ పరిశోధనలో ఓ విషయం తెలిసింది. అదేంటంటే.. అమెరికా, జపాన్ లాంటి  దేశాల ప్రజలతో పోలిస్తే.. భారతీయుల మెదళ్లు పొడుగు, వెడల్పూ తక్కువగా ఉన్నాయట. అంతేకాదు బరువు కూడా తక్కువే. 

ఈ పరిశోధన వల్ల అల్జీమర్స్, మతిమరపు వంటి వ్యాధుల్ని ముందుగానే కనిపెట్టడం కుదురుతోందని పరిశోధకులు తెలిపారు. ఈ రీసెర్చ్‌ వివరాల్ని న్యూరోలజీ ఇండియా జర్నల్‌ లో రాశారు. అయితే భారతీయుల మెదళ్లకు సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

ఇండియన్ బ్రెయిన్ అట్లాస్‌ను తయారుచేసేందుకు మరో 100 మంది ఆసక్తి ఉన్నవారిని చేర్చుకోబోతున్నారు. అయితే ఇప్పటివరకూ భారతీయుల మెదళ్లకు సంబంధించిన మ్యాప్ లేదు. ఇప్పుడు 50 మంది పరిశోధకులు కలిసి భారతీయుల బ్రెయన్ టెంప్లేట్‌ని తయారుచేశారు. దీంతో పశ్చిమ ఆసియా దేశాల మెదళ్లతో పోలిస్తే.. ఇండియన్స్ మెదళ్లు కొంచెం చైనా, కొరియా బ్రెయిన్లకు దగ్గరగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.