అమల్లోకి కొత్త ఎక్సైజ్‌ విధానం

తెలంగాణలో కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 03:46 PM IST
అమల్లోకి కొత్త ఎక్సైజ్‌ విధానం

తెలంగాణలో కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

తెలంగాణలో కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి వచ్చింది. శుక్రవారం (నవంబర్1, 2019) కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు గురువారం (అక్టోబర్ 31, 2019) నాటికి అనుమతుల జారీ ప్రకియను 95శాతం వరకు పూర్తి చేశారు. మిగిలిన కొన్ని దుకాణాలకు ఒకట్రెండు రోజుల్లో లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. 

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2వేల 216 దుకాణాలకు కొత్తగా లైసెన్స్‌లు పొందిన వ్యాపారులు ఇక నుంచి విక్రయాలు సాగించనున్నారు. 19 డిపోల ద్వారా ఈ దుకాణాలకు మద్యం సరఫరాకు ఎక్సైజ్‌ అధికారులు గురువారం రాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. గత విధానాల్లో స్వల్ప మార్పుల ద్వారా ఈసారి అమ్మకాలు ఆరంభించకముందే ఖజానాకు రూ.1467కోట్ల భారీ మొత్తం సమకూరింది. కొత్త ఏర్పడిన ఈ విధానం (నవంబర్ 1, 2019) నుంచి 2021 అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం మద్యం విక్రయాలకు అనుమతిచ్చింది. గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఇప్పుడు ఆరు స్లాబులుగా మార్చింది.

అంతేకాకుండా మద్యం దుకాణాల దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా మద్యం దుకాణాల్లో కౌంటర్ దగ్గర, మద్యం నిల్వచేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్సైజ్‌శాఖ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తామని అధికారులు తెలిపారు. నూతన ఎక్సైజ్‌ విదానానికి అనుగుణంగా మద్యం ధరలను పెంచే అవకాశం వుందని అదికారులు వెల్లడించారు.