రైడ్ రైట్ : ట్రాఫిక్ లో వద్దు మెట్రోనే ముద్దు 

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 04:24 AM IST
రైడ్ రైట్ : ట్రాఫిక్ లో వద్దు మెట్రోనే ముద్దు 

హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించేందుకు ఆపద్భాంధవిలా వచ్చింది మెట్రో. కురుక్షేత్రంలో అభిమన్యుడిలా ట్రాఫిక్ లో చిక్కుకున్న నగరవాసులకు ఫుల్ జోష్ నిస్తోంది మెట్రో. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు..క్యాబ్స్ లో వెళ్లాలన్నా..ఆటోలో వెళ్లాలన్నా ట్రాఫిక్ కష్టాలు తప్పనిసరి. వీటన్నింటీకీ ప్రత్యామ్నాయంగా నగరవాసులక కనింపించేది మెట్రో ఒక్కటే. అందుకే మెట్రో ట్రైన్ కు రోజు రోజుకు మెట్రో జర్నీకి ప్రయాణీకులు తాకిడి పెరుగుతోంది. 

ప్రస్తుతం LB నగర్‌–మియాపూర్‌,నాగోల్‌–హైటెక్‌సిటీ, మార్గంలో మెట్రో కొనసాగుతోంది. నగరం రెండు అవుట్ కట్స్ ను కలుపుతు రోజు 5 లక్షలమంది మెట్రోలో ప్రయాణిస్తారని అధికారుల అంచనాలను తల్లక్రిందులు చేసారు మెట్రో ప్రయాణీకులు. ప్రస్తుతం రోజువారీగా సరాసరి 2.30 లక్షలు, పండగలు, వీకెండస్,ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో కూడా 2.60 లక్షలమందికి తగ్గటంలేదు.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

ఇష్టమే అయిన తప్పని మెట్రో కష్టాలు
మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సమస్యలు..వాటికి అధిక ఛార్జీలు, స్టేషన్ల నుంచి వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలను తప్పనిసరిగా వినియోగించాల్సి రావటం వంటి మెజార్టీ సిటీజన్లు మెట్రో జర్నీ పట్ల విముఖత చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 19 నుంచి ఎల్‌అండ్‌టీ ఉచిత షటిల్‌ సర్వీసులు  దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ జిల్లాల పరిధిలోని ఐటీ, బీపీఓ, కెపీఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సౌకర్యార్థం ఎల్‌అండ్‌టీ సంస్థ షటిల్‌ సర్వీసులు(మెర్రీ గో అరౌండ్‌)నడుపనుంది. ఇవి ప్రతి 15 నిమిషాలకో బస్సు ఈ స్టేషన్‌ వద్ద అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. స్టాటింగ్ లో ఈ బస్సుల్లో జర్నీ ఫ్రీ ఉంటుందన్నారు. కాగా ఇప్పటికే 12 ఐటీ కంపెనీలు ఉద్యోగుల సౌకర్యార్థం దుర్గంచెరువు, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ల నుంచి సొంతంగా షటిల్‌ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే.  

ఐపీఎల్‌ జోష్‌ లో మెట్రో
ఐపీఎల్‌ మ్యాచ్‌లు కొనసాగుతున్న క్రమంలో మెట్రో సర్వీసులను అర్ధరాతి వరకు నడపుతున్నారు. దీంతో 21 వేల మంది ప్రయాణికులు మెట్రోరైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారనీ..సిటీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ సర్వీసు వేళలను పొడిగించడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?