విమానంలో వ్యక్తి హల్ చల్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్

గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.

  • Published By: veegamteam ,Published On : October 11, 2019 / 02:32 PM IST
విమానంలో వ్యక్తి హల్ చల్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్

గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు హల్ చల్ చేశాడు. దుస్తులు లేకుండా బాత్ రూమ్ లో తిరుగుతున్న వ్యక్తిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ కు రిక్వెస్ట్ చేశారు. 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన వెంటనే అనుమానాస్పద వ్యక్తిని సిఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. అతని ఒంటిపై పూర్తిగా ఎర్రని మచ్చలు ఉండడంతో డ్రగ్స్ తీసుకున్నాడా లేక ఇంకేదైనా వైరస్ సోకిందా అనే కోణంలో వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రిని నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.