దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 12:14 PM IST
దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. మృతదేహాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రేపు కోర్టు హాజరుకావాలని హైకోర్టు తెలిపింది. మృతదేహాలకు సంబంధించిన కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందని హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు. మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలనుకుంటున్నామని హైకోర్టు తెలిపింది. అయితే రీపోస్టుమార్టం అవసరం లేదని, ఇప్పటికే పోస్టుమార్టం పూర్తైందని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని కొందరు కోర్టుకెళ్లారు. అయితే ఎన్ కౌంటర్ కు సంబంధించి కేసు విచారణ కొనసాగుతుండటంతో కోర్టు ఆదేశాలతో డెడ్ బాడీలను గాంధీ ఆసుపత్రిలోని ఫ్రీజర్ లోనే పెట్టి భద్రపరుస్తున్నారు. అయితే ఇకపై ఫ్రీజర్ లో శవాలను దాచే పరిస్థితి లేకుండా పోయింది. డెడ్ బాడీలు కుళ్లిపోయే స్థితికి వచ్చాయి.

కాగా, డెడ్ బాడీలు కుళ్లిపోకుండా ఉంటాలంటే ఎంబామింగ్ చేయాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు. ఎంబామింగ్ చేశాక ఫార్మల్ డీహైడ్ ద్రావకాన్ని రక్తనాళాల ద్వారా మృతదేహాల్లోకి ఎక్కిస్తే అవి పాడవకుండా ఉంటాయి. అయితే మృతదేహాలను భద్రపరచాలని మాత్రమే కోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఎంబామింగ్ చేయాలంటే కోర్టు పర్మిషన్ మస్ట్. పైగా ఎంబామింగ్ చేస్తే.. మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేసే పరిస్థితి ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గాంధీ ఆసుపత్రి పాలనా యంత్రాంగం అయోమయంలో పడిపోయింది. ఎటూ తేల్చేకోలేక ఇబ్బంది పడుతున్నారు.

దిశ హత్యాచారం ఘటన ఎంత సంచలనం అయ్యిందో.. ఎన్ కౌంటర్ కూడా అంతే సెన్సేషన్ అయ్యింది. ఎన్ కౌంటర్ బూటకం అంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో డెడ్ బాడీలను భద్రపరచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశిస్తూ త్రిసభ్య కమిషన్ వేసింది. దీంతో కమిషన్ ఓకే చెబితేనే.. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే కమిషన్ సభ్యులు రావడానికి ఇంకా వారం రోజుల సమయం పడుతుంది. ఈ లోగా ఎంబామింగ్ చేయకపోతే డెడ్ బాడీలు పూర్తిగా కుళ్లిపోవడం ఖాయం. 

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి సర్వీస్‌ రోడ్డులోని చటాన్‌పల్లి దగ్గర నవంబర్ 27వ తేదీ రాత్రి వెటర్నరీ డాక్టర్‌ దిశపై నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బతికుండగానే సజీవదహనం చేశారు. 28వ తేదీ దిశ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. నలుగురు నరరూప రాక్షసులను వెంటనే ఉరి తీయాలని నిరసనలు హోరెత్తాయి. ఆ తర్వాత నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. డిసెంబర్ 6న ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. ఆయుధాలు లాక్కుని దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారని.. ఆత్మరక్షణ కోసం ఆ నలుగురినీ ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.