వణికిస్తున్న చలి

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది.

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 04:29 AM IST
వణికిస్తున్న చలి

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది.

ఆగ్నేయ, తూర్పు దిక్కుల నుంచి తేమగాలులు ఆగిపోయి.. ఈశాన్య దిక్కు నుంచి చలిగాలులు వీస్తున్న కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది. మూడ్రోజుల వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.  

ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం కనిపిస్తున్నది. ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు కొనసాగించారు. తెలంగాణలో చలితీవ్రత మరింత పెరుగుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గజగజ వణికిపోతున్నది.
  
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాణి మం డలం గిన్నెధరిలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబర్‌ 29న ఆదిలాబాద్‌లో 5.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డుకాగా, ఆ తర్వాత రెండో తక్కువ ఉష్ణోగ్రతలు గిన్నెధరిలోనే నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌ పట్టణంలో 7.8 డిగ్రీలు, మంచిర్యాలలో 9.2 డిగ్రీలు, నిర్మల్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.