IPL ఫైనల్ మ్యాచ్ : అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 05:54 AM IST
IPL ఫైనల్ మ్యాచ్ : అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు

IPL ఫైనల్ మ్యాచ్‌‌కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సెక్యూరిటీని సమీక్షించారు. రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కండీషన్లు వెల్లడించారు.

మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకులు ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్టీసీ, మెట్రో అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. స్టేడియంకు ఆర్టీసీ బస్సులు ఎక్కువ నడపనున్నట్లు తెలిపారు. మ్యాచ్ రాత్రి రాత్రి 11.30 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత కూడా అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఇందుకు మెట్రో కూడా అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు పోలీస్ కమిషనర్.

స్టేడియం చుట్టుపక్కలా 2 వేల 850 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. ప్లేయర్స్‌కు ఎస్కార్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి గేట్ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.