IRCTC సర్వీసు చార్జీ మోత

ఐఆర్‌సీటీసీ సర్వీసు చార్జీల మోత మోగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సర్వీసు చార్జీ పెంపు తిరిగి అమలులోకి తీసుకొచ్చింది.

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 05:36 AM IST
IRCTC సర్వీసు చార్జీ మోత

ఐఆర్‌సీటీసీ సర్వీసు చార్జీల మోత మోగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సర్వీసు చార్జీ పెంపు తిరిగి అమలులోకి తీసుకొచ్చింది.

ఐఆర్‌సీటీసీ సర్వీసు చార్జీల మోత మోగించింది. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరు నుంచి సెకండ్‌ సిట్టింగ్‌ టిక్కెట్‌ ధర ఆగస్టు నెలాఖరు వరకు రూ.130. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రూ.17.49 సర్వీసు చార్జీని ఐఆర్‌సీటీసీ పెంచడంతో టిక్కెట్‌ చార్జీ రూ.148కి చేరుకుంది. అదే ఏసీ చైర్‌కార్‌ టిక్కెట్‌ ధర రూ.430 నుంచి రూ. 35.40 పైసలు సర్వీసు చార్జీ కలుపుకుని రూ.465కి చేరుకుంది. ఇదేవిధంగా స్లీపర్‌, ఫస్టు ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ టిక్కెట్ల బుకింగ్‌పై కూడా సర్వీసు చార్జీ అమలు అవుతుంది.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సర్వీసు చార్జీ పెంపు తిరిగి అమలులోకి తీసుకొచ్చింది. దీంతో సెకండ్‌ సిట్టింగ్‌, స్లీపర్‌ క్లాస్‌లపై రూ.17.49 పైసలు, ఏసీ తరగతుల టిక్కె ట్లపై రూ.35.40 పైసలు అదనంగా ప్రయాణికుడు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో టిక్కెట్‌ చార్జీతో పోలిస్తే దాదాపుగా సర్వీసు ట్యాక్స్‌ రూపంలో 10 శాతం పైగా పెరిగింది.

మూడేళ్ల క్రితం ఐఆర్‌సీటీసీ సంస్థ ఆన్‌లైన్‌/మొ బైల్‌ యాప్‌లో ఈ, ఇంటర్నెట్‌ టిక్కెట్ల బుకింగ్‌పై స ర్వీసు చార్జీలు వసూలు చేసేది. హఠాత్తుగా కేంద్రం సర్వీసు ట్యాక్స్‌ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో చార్జీలు పెరిగాయి.

మొబైల్ యాప్ లలో టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే సర్ ఛార్జీల బాదుడు తప్పదని భావించి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛార్జీల పెంపును తప్పించుకోవాలంటే రైల్వే స్టేషన్లలోనే టిక్కెట్లు తీసుకోవాలి. ఫలితంగా కౌంటర్లలో రద్దీ పెరుగవచ్చని భావిస్తున్నారు.