ఎవరా కీలక నేత.. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్న ఐటీ ప్రెస్ నోట్

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 03:04 PM IST
ఎవరా కీలక నేత.. రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్న ఐటీ ప్రెస్ నోట్

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించింది. మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలపై వచ్చిన ఆరోపణలతో పక్కా ప్లాన్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో ఏక కాలంలో సోదాలను నిర్వహించింది ఐటీ శాఖ. వీటితో పాటు ఓ కీలక రాజకీయ నేతకు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు.. కీలక ఆధారాలు, పత్రాలు లభించాయి.

రూ.2 వేల కోట్లకు పైగా అక్రమాలకు:
వేల కోట్ల కాంట్రాక్టులు పొందిన ఆ మూడు కంపెనీలు.. పన్నులు ఎగ్గొట్టడానికి.. దొంగ కంపెనీలను సృష్టించి వాటికి సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్‌, బోగస్‌ బిల్లులు ద్వారా ఈ మూడు కంపెనీలు 2 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఈ తనిఖీల్లో తేలింది. ఐటీ శాఖ నుంచి తప్పించుకోవడానికి..  ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి సబ్‌ కాంట్రాక్టులను బదలాయించారు. ఇందులో చివరగా ఉన్న కంపెనీ టర్నోవర్‌ 2 కోట్ల రూపాయల కన్నా తక్కువగా ఉండేలా చూసుకున్నారు. దీని వల్ల అకౌంట్ బుక్స్, ట్యాక్స్‌ ఆడిట్‌ను నిర్వహించాల్సిన పని ఉండదు.

పన్నులు ఎగ్గొట్టిన మూడు కంపెనీలు:
వీటి ద్వారా పనులు జరిగినట్లు చూపించిన ఆ మూడు కంపెనీలు పన్నులు ఎగ్గొట్టాయి. అయితే.. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు.. అసలు కంపెనీలకు, దొంగ కంపెనీలకు యజమానులు ఒకరేనని తేల్చారు. ఈ కంపెనీలన్నింటికీ ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఐటీ రిటర్నులను దాఖలు చేసిన విషయాన్ని గుర్తించిన ఐటీ శాఖ.. పక్కా ఆధారాలతో వీరిని బుక్‌ చేసింది. 40 ప్రాంతాల్లో చేసిన సోదాల్లో అనుమానాస్పద డాక్యుమెంట్లు, లూజ్‌ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కీలక నేత కుమారుడి సన్నిహితుడికి ఉచ్చు:
ఈ తనిఖీల్లోనే .. కీలకమైన వాట్సప్‌ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను గుర్తించారు. లెక్క చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు సీజ్‌ చేశారు. 25 బ్యాంక్‌ లాకర్లను కూడా బ్లాక్ చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారమే దాదాపు 2 వేల కోట్లకు పైగా అధికారులు గుర్తించడంతో.. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా..  ప్రముఖ రాజకీయ నాయకుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శికి, ఆ రాజకీయ నేత కుమారుడి సన్నిహితుడికి ఉచ్చు బిగుసుకున్నట్లే తెలుస్తోంది. 

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ కుంభకోణం బయటపెట్టిన ఐటీ శాఖ
* లెక్కలు చూపని రూ.2వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించిన ఐటీ శాఖ
* ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, ఢిల్లీ, పుణెలో సోదాలు చేసిన ఐటీ అధికారులు
* 40కి పైగా ప్రాంతాల్లో ఏకకాకలంలో సోదాలు చేసిన అధికారులు
* 3 ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు

* దాడుల్లో బటయపడ్డ వివరాలను వెల్లడించిన ఐటీ అధికారులు
* బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లుల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తింపు
* ఓ కీలక రాజకీయ నేత మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం
* తనిఖీల్లో లభించిన అనుమానాస్పద డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం
* వాట్సాప్ మెసేజ్ లు, ఈమెయిల్స్ ను గుర్తించిన ఐటీ అధికారులు
* లెక్కచూపని విదేశీ లావాదేవీలను గుర్తించిన అధికారులు

* బోగస్ సంస్థలకు సబ్ కాంట్రాక్టులను ఇచ్చిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు
* ట్యాక్స్ ఆడిట్ ను తప్పించుకోవడానికి రూ.2కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలను సృష్టించిన అక్రమార్కులు
* షెల్ కంపెనీలకు అసలు ఓనర్లు ప్రధాన కాంట్రాక్టర్లే అంటున్న ఐటీ అధికారులు
* అసలు కంపెనీలు, షెల్ కంపెనీల ఐటీ రిటర్నులను ఒకే ఐపీ అడ్రస్ తో ఫైల్
* ప్రాథమిక దర్యాఫ్తులోనే రూ.2వేల కోట్లకుపైగా అక్రమాల గుర్తింపు
* లెక్కచూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు సీజ్
* 25 బ్యాంకు లాకర్లను సీజ్ చేసిన ఐటీ అధికారులు