తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

  • Edited By: veegamteam , September 4, 2019 / 01:40 AM IST
తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ , రేపు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. ఏపీలోని కోస్తాంధ్రలో అనేకచోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. 

అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమాట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆవర్తనం ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు.

కోస్తాంధ్ర తీరం వెంబడి సముద్రం అలలు ఉద్ధృతంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలలు వీస్తాయని వెల్లడించింది. ఏపీలోని పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది. రాగల 48 గంటలపాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

గడచిన 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బొబ్బిలి, మెరకముదిదాంలో 6, కొమరాడలో 5, జూపాడు బంగ్లా, సీతానగరం, గజపతినగరంలో 4 సెం.మీ చొప్పున వర్షపాత నమోదైంది.