బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకి పంపండి

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. బాబ్రీ కూల్చివేత ఘటనపై

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 02:42 PM IST
బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకి పంపండి

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. బాబ్రీ కూల్చివేత ఘటనపై

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. మసీదు కూల్చివేత ఘటనపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజుగా చెప్పారు. ఆ రోజును బ్లాక్ డే గా పాటించనున్న నేపథ్యంలో మెహిదీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్ నిర్మాణం కోరుతూ డిసెంబర్ 6న ప్రార్థనలు.. ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలిపాలని ముస్లింలకు అక్బరుద్దీన్ పిలుపునిచ్చారు.

అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయాన్ని అక్బరుద్దీన్ స్వాగతించారు. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం మరో చోట ఇస్తామన్న 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి కూడా తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. 

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మ భూమిగా గుర్తిస్తూ అక్కడ రామాలయం నిర్మించాలని చెప్పింది.

కాగా, ఈ తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సవాల్ చేయాలని నిర్ణయించింది. తీర్పును పున: సమీక్షించాలని కోరనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ మొదటి వారంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించింది.