జయరామ్ కేసు : పోలీసులను కూడా విచారిస్తామన్న డీసీపీ 

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 11:01 AM IST
జయరామ్ కేసు : పోలీసులను కూడా విచారిస్తామన్న డీసీపీ 

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్లాడినట్లుగా రాకేశ్ రెడ్డి ఫోన్ డేటాలో ఉందనీ..విచారణలో శ్రిఖా చౌదరి పాత్ర స్పష్టమైతే ఆమెను కూడా అరెస్ట్ చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అనుమానితులుగా ఉన్న 50మందిని ఇప్పటికే విచారించామనీ..మరో ఇద్దరు నిందితులను గుర్తించామని వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో  ప్రధాని నిందితుడు రాకేశ్ రెడ్డి పోలీసులకు రోజుకో సినిమా కథ చెబుతున్నాడు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి కొంతమంది పొలిటీషన్స్ పేర్లు కూడా చెప్పాడనీ..వారికి రాకేశ్ కు..జయరామ్ ఆస్తులకు గల సంబంధాలేమిటి..జయరామ్ ఆస్తుల విషయంలో శ్రిఖా పాత్ర.. అనే పలు కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తు.. ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామనీ డీసీపీ తెలిపారు. ఈ కేసుతో సంబధముందని విచారణలో వెల్లడయితే ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.